పుట:Kavijeevithamulu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

279

2. నరేంద్రభామ. సామాన్యక్షత్రియునిభార్య, అనఁగా మూర్ధాభిషిక్తులు కాకున్నను రాజు లని వ్యవహరింపఁబడుశాఖవారి స్త్రీ.

3. వైశ్యభామ, కోమటు లని యాంధ్రదేశములో వ్యవహరింపఁబడువైశ్యజాతి స్త్రీ.

4. శూద్రభామ. ఇందు శూద్రులలో గౌరవముగా నుండి తెలగా లని వంటరు లని వ్యవహరింపఁబడుజాతి స్త్రీ.

5. ఆంధ్రనియోగిభామ. ఆంధ్రబ్రాహ్మణులలో స్మార్తశాఖలోని లౌకికులకు నియోగు లని పేరు. అట్టినియోగులు కేవల మాంధ్రదేశములో నుండువారే కావున వారికి నాంధ్రనియోగిశాఖ యని నామంబు చెప్పెను. శ్రీనాథకవియు నాశాఖలోనివాఁడే. అన్ని శాఖల స్త్రీలను వర్ణించునపుడు తనశాఖస్త్రీనిగూడ వర్ణింపవలయుం గావున నదియును జెప్పెను.

6. నియోగిస్త్రీ. నియోగులలోఁ దెలగాణ్యు లనియు, నందవరీకు లనియు నింకను వివిధ శాఖ లున్నవి. అట్టిశాఖల నన్నిటింగూర్చి యొక్కపర్యాయము నియోగిశాఖా స్త్రీని వర్ణించెదను.

7. వేపార్యంగన. ఆంధ్రదేశములోని మధ్వమతస్థు లగుబ్రాహ్మణశాఖవారికి "వేపారు" లనువ్యవహారము కలదు. వీరికి కన్నడము, ద్రవిడము, మొదలగుదేశములలో వైష్ణవు లని వ్యవహారము కలదు. రామానుజమతస్థులు వైష్ణవశబ్దవాచ్యులుగా నున్నను వారి నాదేశములలో మూఁడునామములవైష్ణవు లని వ్యవహరింతురు. అట్టివారిని శ్రీనాథుఁ, డాంధ్రదేశవ్యవహారానుసారముగ వైష్ణవు లని వ్రాసి యున్నాఁడు.

8. మఱియొకవేపారిస్త్రీ. ఆంధ్రదేశములో ఋక్శాఖాబ్రాహ్మణులలోఁ గొందఱకుఁ గరణకమ్మవేపారు లనియు, తెలగాణ్యులలో