పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన మహమ్మదీయులు భారతీయులు కారా?

ప్రదర్శిస్తున్నవి గాని కేవలము ఒక్కరికే చెందినట్టి శిల్పమని చెప్పడానికి వీలైనవి కావు. హిందువుల కట్టడాలపైన గల గాలిగుమ్మటములు, వికసించినపుష్పముల వంటి స్వరూపములు, అష్టభుజముల కట్టడములు, స్తూపీలు, బురుజులు, గోడలపైన కిటికీలపైన చెక్కిన శిల్పమూ మహమ్మదీయుల శిల్పమే! మహమ్మదీయుల కట్టడములలో అందంగా చెక్కిన రాతిపోటీపలకలు, ముందుకు చొచ్చుకుని వచ్చే మంటపములు, నలుపలకల స్తంభములు, అడ్డముగా నేసే తనాబీలు, బల్లపరుపు కప్పులు, అతిసున్నితంగానూ, చిత్రవిచిత్రంగానూ చెక్కిన నగిషీలూ కేవలమూ హిందువుల శిల్పమే!! ఇలాగ ఈదేశంలో ఈ హిందూ మహమ్మదీయుల శిల్పాలు రెండూ లీన మైనట్లు మహానగరాలన్నింటిలోనూ నిదర్శనాలు కనబడుతున్నవి.

చి త్ర లే ఖ న ము

శిల్పములోలాగనే చిత్రలేఖనములోకూడా హిందూమహమ్మదీయ నైపుణ్యములు మేళవించిన లక్షణాలు కనబడుతున్నవి. చక్రవర్తులు, నవాబులు ఈకళను పోషించడంపోయి, ఇవి క్షీణించినప్పటికీ దీని యందలి సామాన్యలక్షణాలు మాత్రం పోలేదు. పారశీకసాహిత్యములోని శృంగారకావ్యముల కధలును భారతదేశ జనసామాన్యానికి అనుశ్రుతంగా సంక్రమించివచ్చిన కధలను భారతదేశ హిందూమహమ్మదీయ ప్రజాజీవనమును మన దేశపుచిత్తరువులలో చిత్రింపబడి యున్నవి.

మనుష్యులనూ మృగాలనూ చిత్రించకూడ దని ఖురాను నిషేధించినందువల్ల మతావేశంగల ముసల్మానులు కొందరు ఈకళను పోషించక పోయినప్పటికీ, మొగలాయి చక్రవర్తులున్నూ, వారిఆశ్రితులైన నవాబులున్నూ దీనిని ప్రొత్సహిస్తూనే వుండేవారు.

మహమ్మదీయుల కాలంనాటి నుంచీకూడా చక్కని చిన్న చిత్రాలను చిత్రించే ఒక కొత్తపద్ధతి హిందూమహమ్మదీయ చిత్రకారులలో వ్యాపించింది. ఈ యుభయమతముల కళోపాసకులూ