78
కథలు గాథలు
హిందువు లనియే సుమండీ! ఇంతేకాదు. భారతదేశపు ముసల్మానుల మగుటవల్ల మనము మధ్యఆశియా దేశము లందలి అనాగరికమూకలకన్ననూ తురుష్క పారశీక దేశములందలి ముసల్మానులకన్ననూ, మనను 'హిందువు ' లని పిలిచే జాతులవా రందరికన్ననూకూడా, సాంఘికంగానూ బుద్దిబలంలోనూ శ్రేష్ఠులముగా నున్నాము. పారశీక దేశములోని పూర్వనాగరికతయైన 'నస్సానియనుల ' సభ్యతయున్నూ, సాహిత్యమున్నూ అక్కడికి వచ్చిన ఇస్లాములో గొప్పమార్పును కలిగించి జలాలుద్దీన్ రూమీ, ఉమర్ ఖయ్యాముల వంటి మహాకవులను సృష్టించినట్లే మనదేశంలో హిందువుల పూర్వనాగరికత తత్వవేదాంతములు భారతీయముసల్మానులను సృష్టించినవి. వివిధదేశములందలి పూర్వనాగరికతలు ఇస్లాములో కలిగించిన మార్పులు పరిశోధింపతగిన విషయము."
దు స్తు లు
ఉత్తర హిందూస్థానంలో హిందువులు, మహమ్మదీయులూ, ధరించే దుస్తులూ, నివసించే ఇళ్లూ ఒకే మాదిరిగా నుంటవి. బయటకు పోయేటప్పుడు హిందువులైనా మహమ్మదీయులైనా పాయిజామాలూ, పగ్రీలూ వేసుకుంటారు. ఇళ్లలో - ముఖ్యముగా గ్రామాలలో - ధోవతీ, ఉత్తరీయమూ ధరిస్తారు. అనేక ప్రాంతాలలో అంగీయాయున్నూ, ఘోషాకోసం మేలిముసుగుగా వేసుకొనేజలతారు వోణీ, కుచ్చెళ్లపోసికట్టిన పమిటి పావడాను, రవికనూ ఈ వుభయమతములవారి స్త్రీలూ భేధమేమీ లేకుండా ధరిస్తారు.
శి ల్ప ము
ఉత్తరహిందూస్థానములో మతాలకు సంబంధించిన మసీదులూ, దేవాలయాలూ గాక లౌకికజీవితానికి సంబంధించిన రాజనగరులు, బాటసారుల కోసం కట్టిన సరాయిలు, వీధిలోకి కట్టిన ఇళ్ళు వాకిళ్ళు, స్నానఘట్టాలూ, రాజపుత్రస్థానంలోను మధ్యరాష్ట్రంలోనూ అయోధ్య ఆగ్రా రాష్ట్రాలలోనూ పంజాబులోను గల గొప్ప నగరా లన్నింటి లోనూ హిందూమహమ్మదీయుల రుచులు రెండూ కనపడే శిల్పాన్ని