80
కథలు - గాథలు
ఒండొరులను గురుశిష్యులుగా స్వీకరించడానికి యెలాంటి అభ్యంతరమూ వుండేది కాదు.
సం గీ త ము
భారతదేశంలో సజీవమైయున్న లలితకళలళో సంగీత మొకటి. దీని చరిత్రను చూస్తే హిందూ మహమ్మదీయ సభ్యతలూ ఏరీతిగా మేళవించినదీ తెలుస్తుంది. ఉత్తర హిందూస్థానంలో జంత్రగాత్రముల సంగీతవిద్య వంశపారంపర్యముగా గాయకులుగా నున్న హిందూ మహమ్మదీయ కుటుంబములలో స్ధిరంగా నెలకొని యున్నది. ఈ ఉభయ మతముల గాయకులూ ఒకేవిధమైన సంగీతవిద్యను అభ్యసిస్తున్నారు. ఒకే పాటలను పాడతారు ఒకేవిధమైన జంత్రములను వాయిస్తారు. ఒకేవిధమైన రాగములను అలాపన చేస్తారు. ఈ సంగీతవిద్య పూర్వకాలంనాటి హైందవ సంగీతశాస్త్ర విధానమును పారశీక ఫణితులతొ మేళవించి నిర్మించిన ఒక అపూర్వమైన సంగీతసంప్రదాయముగా నున్నది.
ఢిల్లీలో ఖిల్జీతొగ్లకు చక్రవర్తుల ఆస్థానవిద్వాంసుడుగా నుండిన అమీర్ ఖుస్రూ ఈ యపూర్వమైన సంగీతసంప్రదాయానికి మూలపురుషుడని అంటారు. ఇప్పుడు వాడుకలో నున్న రాగముల పేర్లూ, రాగీణుల పేర్లూ కూడా హిందూమహమ్మదీయ సమ్మేళనానికి నిదర్శనములుగా నున్నవి. 'ఇమాన్ కల్యాణి ' అనే రాగంలో 'ఇమాన్ ' అనే పారశీక పదమున్నూ, 'కల్యాణి ' అనే సంస్కృత పదమున్నూకలిసి ఏకసమాసమైనవి.
హిందూమహమ్మదీయ గాయకులు ఒండొరులకు గురుశిష్యులుగా వుండేవారు. ఇలాగే హిందూ మహమ్మదీయరాజులు ఉభయ మతముల గాయకులనూ పోషించేవారు. ఇప్పటికీకూడా ఉత్తరహిందూస్థానములో ఒకే తివాచీపైన హిందూమహమ్మదీయ గాయకులు తమ వీణలను, తంబురాలను వుంచుకుని సంగీతము పాడతారు. హిందూ మహమ్మదీయులు ఒండొరుల కచ్చేరీలలో మృదంగములను తబలాలను వాయిస్తారు. అన్నింటికంటె అపూర్వమైన సంగతి యేమిటంటే, ఈ