పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

కథలు - గాథలు

తెలుసుకోవలసిందని 1794 లో చెన్నపట్నాన్నుంచి ఒక ఉద్యోగిని పంపగా వాళ్ళందరూ తమ పేష్కషు నదివరకే ఇచ్చివేశారని తేలింది. తప్పుడు లెక్కలు వ్రాయవలసిందని స్నాడుగ్రాసు తనను నిర్బంధించాడని గోపాలకృష్ణమ్మ ప్రమాణం చేశాడు. నేనలాంటిపని చేయమనలేదని స్నాడుగ్రాసు అన్నాడు. స్నాడుగ్రాసు కూడా దీనిలో భాగస్వామే అని, తేలినా సరియైనరుజువు దొరకనందువల్ల అతడు తాను చేయవలసినపని తిన్నగా నిర్వహింపక ఉపేక్ష చేసినాడని సస్పెండు చేశారు. గోపాలకృష్ణమ్మను జైలులో పడవేసి సొమ్ము కక్కేవరకు నిర్భంధించి వుంచారు. శిస్తురసీదు కవుంటరుఫాయిలు కాగితాలు లెక్కలతో సరిగా వున్నయా లేవా అని చూడడం మాత్రమే తన పని అనిన్నీ, అవి సరిగానే వున్నాయనిన్నీ, కవుంటరుఫాయిలులో వసూలు చేసిన దానికన్న గోపాలకృష్ణమ్మ తక్కువ మొత్తాలు వేసి నట్లైతే తా నేమిచేయగలననిన్నీ స్నాడ్ గ్రాసు చెప్పి తాను నిర్దోషినని వాదించాడు. 1797 ఇతనికి మళ్ళీ పని యిచ్చారు.

రెండవమారు 1810 నాటికే మళ్లీ ఇతనిపైని ఫిర్యాదులు చెలరేగాయి. ఇతని సంజాయిషీకి రివిన్యూబోర్డువారూ గవర్నమెంటు హర్షించలేదు. ఇతనిని చార్జీ వప్పగించ వలసిందని బ్రౌను అనేదొరను పంపించారు. ఈ బ్రౌను వచ్చేటప్పటికి తన ఆఫీసు దగ్గరకు తుపాకీబారు మేరదూరంలోకి వస్తే కాల్చివేస్తానని బెదిరించి అతని ఎదటనే లెక్క పుస్తకాలూ రికార్డులూ చిలకసరస్సులో పారవేశాడు. తన పీక మీదికి తేగలసాక్షి సాధనాలన్నింటినీ అలా మాపుచేసి జిల్లాలో తనకు గల వ్యవహారాలన్నీ మెల్లగా చక్కబెట్టుకొని ఆఖరుకు చెనపట్నం వెళ్లాడు.

'జాన్ లా ' అనే ఆయన 1908 లో "గ్లింప్సెస్ ఆఫ్ హిడెన్ ఇండియా" అనే పుస్తకంలో ఈ క్రింది విధంగవ్రాశారు

"స్నాడ్ గ్రాసు రంభలో కట్టించిన దివ్యభవనాన్నిఎంతో చక్కగా అలంకరించాడు. తన సాలలలో మంచి గుఱ్ఱాలనూ, ఏనుగు