2
కథలు - గాథలు
5
ఫాజుల్ కేసు పెట్టాడు. కాని దేశం అల్లకల్లోల స్థితిలో నుండుటవల్లా, గుంసూరులో తిరుగుబాటు జరిగినందువల్లా, ఈ కేసు విచారణ జయప్రదంగా నడవడానికి బ్రౌనుదొరకు అవకాశం లెకపోయింది.
1793 కూ 1801 కీ మధ్య యీజిల్లా పరిపాలనను గురించిన తప్సీలు తెలుసుకోడానికి రికార్డులు ఏమీలేవని జిల్లామాన్యూలు వ్రాసిన మాల్టుబీ వ్రాసినాడు. ఈరికార్డు లేమైనవని విచారించగా బ్రౌను దొరగారే వానిని తగల వేశారని స్పాటిస్ వుడ్ అనే కలెక్టర్ వ్రాశాడు. కాని ఇది విశ్వసించతగినట్లు లేదు. ఈజిల్లాలో దీనిని గురించి ఒకకధ చెపుకుంటారు. తనపైని సాక్ష్యం దొరకకుండా రెవిన్యూ లెక్కలపుస్తకాలన్నీ స్నాడ్ గ్రాసు చిలకసరస్సులో పారవేశాడట. "రంభదగ్గరకు వచ్చే టట్లయితే ప్రాణం తీస్తానని బ్రౌను దొరను బెదిరించాడట!
రంభలో కూర్చుని స్నాడ్ గ్రాసు చేసిన విచిత్రాలను గురించీ, అతన్ని అక్కడ నుండి కదిలించడం గవర్నమెంటుకు ఎంత కష్టసాధ్యమైనదో ఆ సంగతిని గురించి ఇంకా కొన్ని కధలు ప్రచారంలో వున్నాయి. వాటిని ఆంగ్లేయగ్రంధకర్తలు తమ పుస్తకాలలోకి కూడా ఎక్కించారు.
కలకత్తాలో సండేస్టేట్సుమన్ అనే పత్రికలో 1938 సంవత్సరం అక్టోబరు 23 వ తేదీన సి.బి.సి అనే పొడి అక్షరాలతో ఈస్నాడ్ గ్రాసును గురించిన కధ వ్రాయబడినది. దానిలో పైనచెప్పిన సంగతులుగాక ఇంకా కొన్ని విశేషాలు వ్రాయబడినాయి.
స్నాడ్ గ్రాసుకు 1791 లో గంజాం రెసిడెంటు ఉద్యోగం వచ్చిన తరువాత గోపాలకృష్ణమ్మను తనకు సహాయ దుబాషిగా ఏర్పరచుకొని అతని సహాయంతో రివిన్యూలో నూటికి 90 వంతులు మాత్రం సర్కారుకు జమకట్టి తక్కినది స్వంతానికొసం అట్టేఎట్టుకోవడం ప్రారంభించాడు. రంభలో కట్టించిన ఇంటికి 20 వేల పౌనులు ఖర్ఫు అయినదట. జమీందారులు ఎందుకు బకాయి పెడుతున్నారో