కథలు - గాథలు
7
లనూ, కట్టించి వుంచారు. పెద్ద నవాబులాగు జీవించెవాడు. రంభ మారుమూలగా వున్నది. చెన్నపట్నంనుంచి కలకత్తా వెళ్లేదొరలు సముద్రంమీదనే సరాసరి వెడతారుకాని యీపక్కకిరారు. ఎవరైనా వస్తే మాత్రం ఇతడు వాళ్లని వదలి పెట్టేవాడుకాదు. వాళ్లకు విందులు చేసి వేటలు ఏర్పాటుచేసి, ఆదరించేవాడు. ఇతడు కాపురం ఉన్న ఇంటికి ఎదురుగా చిలక సంద్రంలో రెందుమైళ్లదూరంలో పదిహేను అడుగుల చతురంగల ఒక చిన్న లంకవున్నది. దానికి బ్రేక్ ఫాస్టు ఐలెండు అనిపేరు. తనపనికి ఎవరూ అంతరాయం కలిగించకుండా ప్రశాంతంగా చేసుకోవడానికని ఆలంక మీద ఒక్కటేగది కట్టించి అది తన ఆఫీసు అన్నాడు. ఆగదిపైన స్తూపీబురుజులాగు గోపురం ఒకటి కట్టించాడు. ఆ బురుజులో ఒక దీపం వేళ్లాడ గట్టేవాడు. దీనిని దీపస్తంభం అనేవాడు. తన రివిన్యూ లెక్కలూ, రికార్డులూ అన్నీ ఈ గదిలో పెట్టించాడు.
ఈ జిల్లా పరిస్థితులు బాగాలేవని మద్రాసు గవర్నమెంటు పంపిన తాఖీదును ఇతడు చిత్తుకాగితాల బుట్టలో పడవేశాడు. లెక్క పుస్తకాలన్నీ చెన్నపట్నం పట్టుకురావలసిందని మళ్లీ తాఖీదువచ్చింది. దానికి సరియైన సమాధానం వ్రాయలేదు. వర్షాకాలంలో పూరీ రేవులోకి ఓడలు సరిగా రాలేవని ఇతడు ఎరుగును. ఇలాగు రెండేళ్లు గడిసిన తరువాత అధికారులు కలెక్టరేటును వశంచేసుకుని స్నాడ్ గ్రాసును అతని పుస్తకాలను చెన్నపట్నం తీసుకొని రావడానికి కొంతమంది సోల్జర్లను పంపడానికి నిశ్చయించారని ఇతనికి తెలిసింది. వీళ్లు ఇక్కడికి రావడానికి తనకు తెలియ చేయడానికి వేగులవాళ్లను పెట్టి వాళ్లు వారం రోజుల దూరంలో ఉన్నారని తెలియగానే ఇతడు లెక్క పుస్తకాలన్నీ ఒక పడవలో పెట్టించి ఒడ్దుకు పట్టమన్నాడు. పడవ బ్రేక్ ఫాస్టులంకకు తీరానికి మధ్యకు రాగానే పడవ చీల ఒకటి ఎలాగో వూడి వచ్చింది. ఆ పడవ, దానితో పాటు పుస్తకాలూ మునిగిపోయాయి. పడవవాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్దుకు వచ్చారు. సోల్జర్లు వచ్చినాక స్నాడ్