పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

కథలు గాథలు

ఇంతటి అకృత్యంజరిగినా గంగ గంగ కాకపోదనిన్నీ కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్త కర్మలు జరిగిస్తే వైదికధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగావారు చెప్పిన సలహాబాగానే వున్నదని ఆఖరికివారందరూ నిశ్చయించి, ఉపవాసాలు మాని ఇళ్ళకు వెళ్ళారు.

ఆసమయంలో ఈరాయబారం నడిపిన దొరలలో ఒకరైన 'బర్డు ' గారు ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకట్టినట్టు వున్నదని కొన్ని సంవత్సరాల తరువాత 1884 లో బిషప్ హెబరుగారికి ఈసంగతులన్నీ చెప్పాడు. Bishop Heber's journal - Vol.1 pp.428-32

10. వాకిటికావలి తిమ్మన

(కృష్ణదేవరాయలవారి సన్నిహిత భృత్యులు)

"ప్రాకృత సంస్కృత ఘర్ఘర, మూకీకృత, కుకవితుంగ ముస్తాతతికిన్,
  వాకిటి కావలి తిమ్మన, వాకిట కవికోటి మాధవా కిటికోటే!"

శ్రీకృష్ణదేవరాయలవారి అనుగ్రహానికి పాత్రుడైన ఒక భట్టు రాయలవారి ఆస్థానములోని అష్టదిగ్గజాలనే కవులమీద నీర్ష్యవహించి వారి నెలాగైనా అవమానించాలని ఒక కుట్ర పన్నాడు. ఒక్కరోజున తాను చెప్పినట్లు చేస్తానని రాయలవారిచేత వాగ్ధానం చేయించుకొని, ఆ మరునాడు రాజసభలో అందరూ కూర్చుని వుండగా తాను లేచి కొందరు కవులపేర్లను చదివి "వీరు రాయల వారి సెలవు అయ్యేవరకూ రాజసభలోనికి రాకూడదని రాయలవారి యాజ్ఞ"యైనదని ప్రకటించాడు. ఈ విపరీతపు ప్రకటనను విని