పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపట్నం గవర్నరు దుర్గతి

105

చెప్పి దీనిని గురించి ఎలాంటి చర్యయున్నూ తీసుకోకుండా వుపేక్షించాడు. ఇలాంటి విషయంలోనే బొంబాయి గవర్నరు కార్యాలోచన సభలో అభిప్రాయభేదం వచ్చినప్పుడు అతడు చర్యతీసికొనిన్నీ ఇక్కడి వ్యవహారాలలో ఇలాగ వుపేక్షించడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి యని చరిత్రకారుల యభిప్రాయం. తాను ఇలాగ ఊరుకున్నందువల్ల చెన్నపట్నంలో అధికారాన్ని చేజిక్కుంచుకున్న కార్యాలోచన సభ్యులు ఇంకా అక్రమాలు చేస్తారనిన్నీ కర్నాటక నవాబు గారి బాకీదార్లు హాయిగా కాలక్షేపం చేస్తారనిన్నీ కూడా అతడు ఎరిగి వుండిన్నీ అతడు అందుకుకూడా హర్షించినట్లు వారన్ హేస్టింగ్సు 26-9-1776 వ తేదీన తన స్నేహితుడికి వ్రాసిన ఒక వుత్తరం వల్లనే కనబడుతూవుంది.[1]*

అక్కడ చెన్నపట్నంలో పిగట్టుగారు ఖైదులో పడి మగ్గిపోతున్నాడు. అతడు మనోవ్యాధితో బాధ పడుతూవున్నందువల్ల అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది.

సీమలో కంపెనీ డైరక్టర్ల చర్యలు

చెన్నపట్నంలో జరిగిన సంగతులను గురించి ఇంగ్లాండులో కంపెనీ డైరెక్టర్లకు తెలియగా వారికి విషాదాశ్చర్యాలు కలిగినవి కాని డైరెక్టర్ల కోర్టు అనే కార్యనిర్వాహక సంఘసభలో అభిప్రాయభేదాలు కలిగినందువల్ల దీనిని గురించి వెంటనే తగినచర్య జరపలేదు. 1777 వ సంవత్సరం మార్చి 26 వ తేదీన డైరెక్టర్ల సాధారణ సంఘసభలో ఈ విషయాన్ని గురించి చర్చ జరిగింది. పిగట్టుగారు మళ్ళీ గవర్నరు పదవిలో నుండే ఏర్పాటును త్వరలో చెయ్యవలసినదనిన్నీ ఆయనను ఖైదుచేసిన కార్యాలోచన సభ్యుల చర్యలనుగురించి విచారణ జరిగించ వలసినదనిన్నీ ఆ సభవారు డైరెక్టర్ల కోర్టువారికి శిఫారసు చేశారు.డైరెక్టర్ల కోర్టువారు మాత్రం పిగట్టుగారి మీద అంతగా అభిమానం చూపలేదు. పిగట్టుగారు మళ్లీ గవర్నరుపదవిలో నుండేటట్లున్నూ ఆయనను ఖైదులోనుంచిన సభ్యుల చర్యలను గర్హిస్తూను కొన్ని తీర్మా


  1. * (Memoirs of Warren Hastings. Gleig.Vol.II. pp.106,113)