పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కథలు - గాథలు

నాలున్నూ, కార్యాలోచనసభలో అతనిపక్షముననున్న సభ్యులను విమర్శిస్తూ కొన్ని తీర్మానాలున్నూ డైరక్టర్లకోర్టువారు చేశారు. అయితే పిగట్టుగారి వ్యవహారాన్ని గురించి వారేమీ పర్యవసానం తేల్చలేదు.

ఈ డైరెక్టర్లకోర్టులో సభ్యులు ప్రతియేటా మారుతూవుంటారు. అందువల్ల ఒకమాటు పిగట్టుగారిని అనుకూలంగానూ, ఇంకొకమాటు ఆయనకు వ్యతిరేకంగానూ వుండే తీర్మానాలు చేయడం కూడా జరిగింది. అంతేగాని ఆ వ్యవహారాన్ని గురించి ఇతమిత్ధమని నిర్ణయించి తీర్మానించలేదు. కార్యాలోచన సభలో అధికసంఖ్యాకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా గవర్నరు ప్రవర్తించడం అక్రమమనిన్నీ తంజావూరు దర్బారులో ఇంగ్లీషు కంపెనీ ప్రభుత్వంవారి ప్రతినిధిగా రస్సెలును నియమించడం అసమంజసమనిన్నీ, 21-4-1777 వ తేదీన తీర్మానించారు. గవర్నరుగారు తన కార్యాలోచనసభలోనుంచి బ్రూకుస్ట్రాటనుగార్లను బర్తరపుచెయ్యడాన్ని గురించి ఖండిస్తూ తీర్మానించాలని కూడా ప్రయత్నించారు గాని అది సాగలేదు. పిగట్టుగారి పక్షమవలంబించినవారు అతనిని బలవంతముగా పట్టుకుని ఖైదుచేయడాన్ని గురించిన్నీ కార్యాలోచన సభలో అతని తరఫున నున్నవారిని సభలోనుంచి తోలగించడాన్ని గురించిన్నీ గర్హిస్తూ ఒక తీర్మానం చేయించగలిగారు గాని అవతలిపక్షం వారు ఆర్కాటు నవాబు పిగట్టుగారి కేదో సందర్భంలో ఇచ్చిన చిన్న చిన్న బహుమతుల సంగతిని ఎత్తుకుని వాటిని స్వీకరించడంలో గవర్నరు ప్రవర్తన యేమీ బాగా లేదని తీర్మానించారు. నిజానికి పిగట్టుగారు నవాబు పట్ల ఏలాంటి పక్షపాతమూ చూపించలేదు సరికదా, అతని దురాశను ప్రతిఘటించాడు. అతడు చాలా పెద్దమొత్తాలు లంచమిస్తానన్నా ఇతడు లోబడలేదు.

పిగట్టుగారి వ్యవహారం విషయంలో కంపెనీ డైరెక్టర్ల కోర్టు వారి తీర్మానాలకు విధివిదానాలు గాని ఆద్యంతాలుగాని లేకుండా పోయినవి. 1777 వ సంవత్సరం మే 7 వ తేదీన డైరెక్టర్లకోర్డువారి