పుట:Kasiyatracharitr020670mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరాదులకు చేర్చి యొకటిగా కట్టి తోపువేసి సమీపమందు అగ్రహారముకట్టి యిచ్చివాటికన్నిటికిన్ని జీవనానికి పూర్తియయిన భూవసతి యేర్పచినాడు. అక్కడ భొజనము చేసుకొని 3 1/2 ఘంటలకు బయలు దేరి 3 కోసుల దూరములో నుండే జానంపేట ఫరక్కూనగర మని రెండు పేళ్ళుకలిగి బస్తీ బజారువీధి కలిగియున్న గ్రామము 5 1/2 ఘంటలకు చేరినాను. ఆ యూరు తురకలతో నిండియున్నది. ఒక గోసాయిచావడి గుడికి అంతర్భూతముగా నున్నది. దిగడానికి అదిన్ని, చావిళ్ళును తప్పవేరే యిండ్లలో స్థలము దొరకదు. నీళ్ళకు బహుప్రయాస, లోతుగల బావులు ఊళ్ళోఉన్నా మంచి యుధకము కాదు. దూరమునించి మంచినీళ్ళూ తెచ్చుకోవలసినది. పానగల్లు మొదలుగా ఆయూరివరకు బాట గుర్రపుబండ్లు వచ్చేపాటి విశాల మయి చక్కతనము గలిగియున్నా బాలనగర మనే యూరిముందర కొంచము రాతిగొట్టు. మిగతభాట బహుసరాళముగా నున్నది. పల్లములలో దిగి మిట్టలెక్కుచు భాట సాగిపోవలెను. సాధారణ మయిన యడవినడమ భాట పోవుచున్నది. ఆ జానంపేట వద్ద నొక కోటయున్నది. కడప వదిలిన వెనుక అప్రయత్న పూర్వకముగా శాకములు అక్కడి అంగళ్ళలో దొరకుచున్నవి.

ఈదేశాటనము ఛేసుటవలన దేహమునకు లాఘవము కలుగుట యనే లాభ మొక్కటి మాత్రమే కాక ద్రవ్య సాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రమే కాక ధ్రవ్యసాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రము దొరికినా అవి అపూర్వము లైనందున జీవాత్మునికి మిక్కిలి ప్రియ భొజ్యములుగా నుంచున్నవి. నానావిధ స్వభావములు కలిగిన మనుష్యులు ఇతర దేశపు జంతువులనున్ను, స్థావరములయిన శిలా వృక్షాదులనున్ను చూడడము జన్మాంతర సుకృతముచేత నొకవేళ భక్తి కలుగుటకు కారణము గావచ్చును. ఆ రాత్రి ఆ గ్రామమందు నిలిచినాను.

29 తేది ఉదయాన 4 ఘంటలకు ప్రయాణమై 6 కోసుల దూరములో నున్న షాపుర యూరు 10 ఘంటలకు చేరినాను. దోవలో పాలమాకుల యనే జలసౌఖ్యము గల గ్రామము