పుట:Kasiyatracharitr020670mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మున్నది. ఆ పాలమాకుల వరకు భాట సరాళము. కొంత కొంత దూరము రాతిగొట్టుగా నున్నది. హలచలక వదిలిన వనక పర్వత సమూహముల దర్శనము దారిలో నిదివరకు లేదు. సాధారణమైన యడవినడుమ భాట పోవుచున్నది. ఆ గ్రామములో దిగి వాడికెపడిన మామిడితొపు జలవసతిగా నున్నందున అక్కడ భోజన మునకు దిగినాను. గ్రామమందు కావలసిన పదార్ధములు దొరకును గాని దిగను స్థలమివ్వరు. ఆత్మకూరు మొదలుకొని దిగడానకు దేవస్థలములుంటేనే వయివుగాని యండ్లలో స్థలమివ్వరు. ఇచ్ఫేపాటి విశాలమయిన యిండ్లులేవు.

ముసాఫరులు పరువు కావాలంటే డంభము వహించవలెను. ఆ డంభమునకు తగిన దాతృత్వము లేకుంటే లోకులు సంతోషింపరు. ఇంతే కాకుండా దోవలో విషయభోగములు నెక్కువగా ఆపేక్షించే కొద్ది వ్యసన మొక్కువౌచున్నది.

దూరప్రయాణము బోను మేనా సవారీలు తీసుకొనివచ్చేవారు సవారీలకు దండను ఆసరాచేసి కిందను మీదను 4 ఇనపకమ్ములు బిగియింఛి యిస్కూలు చీలలు కొట్టక మునుపు బలమయిన మూలతగుళ్ళు కొట్టించి ఆ తగుళ్ళలో ద్వారములు చేసి వాటిలో యిస్కూలు చీలలు బిగియించవలెను. అటు చేయనందున నా బంగాళాపాలకీ దోవలోమోసుకొని వచ్చునప్పుడు ఆ చీలలు కొట్టిన తావున పలక చీలి పల్లకీ కిందపడుచు నుండెను. చీలిన చప్పుడు వినగానే నాబోయీలు పల్లకీని దిగువ దించినారు. దోవలో బావులు లోతుగా నుంటే నీళ్ళు చేదుకోవచ్చు నని తెచ్చిన సీమ సన్నతాడు 20 బారలది వద్దనుండగా పయిన 4 కట్లున్నూ చట్టానికి దిగువ 4 కట్లున్ను చుట్టు బలముగా వేసి ముందు దండెకున్ను వెనక దండెకున్ను దిగువ ఛట్టముగుండా మూడు కట్లువేసి బిగించి ఇదివరకు భగత్కటాక్షము చేత ఆ పల్లకీ మీదనే సవారీ అయి వచ్చినాను కాబట్టి పల్లకీసవారీ అయి వఛ్ఛేవారు కొన్ని తాళ్ళు చాలక దోవలో నెక్కడ విచారించినా తాళ్ళు దొరికినవి కావు గనుక సాగ