పుట:Kasiyatracharitr020670mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రస పెట్టకుండా దివాన్ జీతనము చేసే చందులాలా ప్రభృతులు ద్రవ్య కాంక్ష చేత నుభయులకున్ను కలహమును పెంచి వేడుక జూచుచున్నారు. ఈలాటి ప్ర్రారబ్దము నా ప్రయాణకాలములోనే వనపత్రి జమీను దారునికినీ కొలాపురపు జమీనుదారునినిన్ని ఒక సంవత్సరముగా పొసగి తహతహపడుచున్నది. నెను ఆ పెంటపల్లి కోటలో హయిదరాబాదు నవాబువారిది కొంత ఫౌజు ఉన్నందున నయభయాలచేత ఆ ఖిల్లాదారుని స్నేహితుని చేసుకొని జవానులను కొందరినికూడా తీసుకొని 23తేది ఉదయాన 4 ఘంటలకు ప్రయాణమై 2 కోసుల దూరములోనున్న పానగల్లు అనే ఖిల్లాగ్రామము 1-2 ఘంటలకు చేరినాను. 3 కోసుల దూరమునకు వెనక తుమ్మగుంట యనే గ్రామమున్నది. అది మొదలు కుంపిణివారు హయిదరాబాదుకు లష్కరు వెళ్ళడానకు నెర్పరచిన భాట. అంతకు లోగడ దువ్వూరు మొదలుకొని ఆ తుమ్మగుంట వరకు శ్రీశైల యాత్ర నిమిత్తమై నేను కల్పించుకొన్న భాట. ఆ పెంటపల్లెకు పోయిన వెనక హయిదరాబాదుకు వెళ్ళను అనేక భాటలను లోకులు చెప్పుదురు. వాటిలో కొత్తకోటభాటను అందరు సాధారణముగా ముఖ్యమని చెప్పుదురు. అది చుట్టుగానున్ను, ప్రయాసమైన మార్గముగా నున్నది. ఆ తుమ్మగుంటవరకు భాట వెల్లడిగా సరళమయినదిగా యిసకపరగా నున్నది. అది మొదలుకొని పానగల్లువరకు చిన్నచిన్న కొండలపక్క పార్శ్వములలోనుంచున్నది. అపానగల్లు కొండకింద నున్ను, కొండమీద విశాలమైన దుర్గమున్నది. ఆగ్రామమున్ను, దానితొ చేరిన మరికొన్ని గ్రామములున్ను డేరాల దారోగాకు జాగీరుగానిచ్చినారు. గ్రామము బస్తీగాకపోయినా యింగీలీషుల ముష్కరుకు సరంజామాచేసి వాడికె పడినది గనుక ముసాఫరులకు కావలసిన వస్తువులు దొరుకుచున్నవి. ఇండ్లు మిక్కిలి కుసందిగా నున్నవి. చావళ్ళు గలవు. బ్రాంహ్మణులు నిండా పారమార్ధికులుగారు. ఆ రాత్రి అక్కడనే నిలచినాను.

23 తేది ఉదయాన 4 ఘంటలకు బయలునెళ్ళీ 12 ఘంటలకు 3 కోసుల దూరములోనుండే చిన్నమంది అనే గ్ర్రామము చేరి