పుట:Kasiyatracharitr020670mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంది బోయీలనున్ను ఒక ఇడతకు దాటించినారు. అవతలిగట్టుకు పోయి రావడానికి 24 నిముషాలు పట్టుచున్నవి. దాని తావున నదికి నిరుపక్కలా కొండలున్నవి. తద్వారాగాలితోను విస్తరించి ఆఘాటుకు లేదు. గనుక ఆఘాటు ఇతరములయిన ఘాట్లకన్నా నది దాటడానికి క్షేమకరము. నాలుగు ఘంటలకు నాసరంజామాతో గూడా అవతలిగట్టుకు పోయి అక్కడ హాశ్శీలు సవారీకి రూపాయిలు 5ద్ను, గుఱ్రానికి 2 రూపాయిన్ని, శూద్రులకు స్వల్పముగా నున్ను యిచ్చి ఆగట్టువలేనే నిజాం యిలాకా వారికిన్ని యిచ్చి 4 ఘంటలకు బయలుచేరి అక్కడికి మూడుకోసుల దూరములో నుండే పెంటపల్లి అనే గ్రామము 3 ఘంటలకు చేరినాను. డారి కొండలనడమ బోవుచున్నది. అందులో 2 కోసులదూరము రాళ్ళమయమయిన కనమ. అది దాటిన వెనక నొక కోసెడు దూరము వెల్లడిగా, భాట బాగుగా నున్నది. ఆ గ్రామములో విశాలమున్ను, సుందరము న్నయిన వెంకటేశ్వర దేవాలయ మొకటి యున్నది. ముసాఫరులు దిగడానికి ఇదే యిండ్లకన్నావసతిగా నున్నది. బస్తీ గ్రామము 20 కోమటి యిండ్లున్నవి. సకల పదార్ధములున్ను దొరుకును. ఆగ్రామము హయిదరాబాదు రాజ్యములో చేరినది. అయినా హయిదరాబాదు నవాబు క్రింద అనేక జమీనుదారులున్నారు. గనుక కొల్లపురపు జమీనిదారునితో ఆ గ్రామముచేరియున్నది. ఆ జమీందారులు క్లుప్తమయిన రూకలు కట్టి సకల రాజ తంత్రములున్ను తమ తమ జమీనుదారిలో స్వతంత్రముగా జరిపింపుచున్నారు. సేవా సయాయ సంపద ఎక్కువగల జమీనుదారుడు క్లుప్తమయిన రూకలిచ్చుటలేదని చెప్పుట కలదు. అప్పుడు హయిదరాబాదు వారు దండెత్తి కొట్టి సాధించి రూకలు తీసుకునుచున్నారు. ఆ జమీనుదారులకు ఒకరి కొకరికి సరిపడక వచ్చినట్టయితే పోట్లాడి చావడముమాత్రమే కాకుండా ఒకరి గ్రామాదులను ఒకరు కొల్లపెట్టి రహితులను హింసించి గామాదులను పాడు చేయుచున్నారు. ఈలాగున కలహములు పొసగినప్పుడు న్యాయము విచారించి యొకరి కొకరికి సమ


'