పుట:Kasiyatracharitr020670mbp.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాను. 3 కోసుల దూరమునకు వెనక వనపర్తి అనే జమీనుదారి కసుబాగ్రామము ఖిల్లా సహితముగా సంస్థానపరువు కలిగియున్నది. పానగల్లునించి తెచ్చిన జవానులను మార్చడమునకు 2 గంటలసేపు అక్కడ నిలిచినాను. వనపత్రి 2 ఘంటలకు చేరినాను. దోవ యిరుప్రక్కలా అడివి కలిగియున్నా దారి సన్నయిసుకపరగా బాగాఉన్నది. మృగభయము లేదు. వనపత్రివరకు కొండలనడమ భాటపోయినా రాతిగొట్టుకాదు. ఆ యూరున్ను రహదారి అయినందున ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. ఊరూరికి కోటలు వుండడము మాత్రమే కాకుండా హయిదరాబాదువారి రాజ్యములో ఊరూరుకి ఒక జమీదారుడున్నందున శిబ్బందికి జీవనము కలగడమొక్కటేగాని, రహితులకు న్నితరులకున్ను క్షేమములేక ప్రాణభయముతో సదాకాలము తోయుచు నుండవలసి యున్నది.

కుంఫిణివారు మజిలీపట్టీలు వారి పంచాంగములో వ్రాయుచువచ్చుచున్నారు. గ్రామాదులపేళ్ళు అడిగితే అట్టి గ్రామమే దారిలోలేదనుచున్నారు. గ్రామదుల దూరమును కొన్ని ప్రకరణములలో తప్పివ్రాసినారు. ఇందుకు సందేహములేదు.

ఆచిన్నమంది అనేవూళ్ళో వసతి యయిన చెరువు కట్టమీద నీడయివ్వగల చెట్లున్నవి. ఇండ్లలో దిగడానకు స్థలముచాలదు గనుక చెరువుకట్టమీదనే వంట చేసుకొని భోజనము చేసి 2 ఘంటలకు బయిలువెళ్ళి అక్కడికి 4 కోసుల దూరములోనుండే గణపురము సాయంకాలము 3 ఘంటలకు చేరినాను. ఆగణపురానికి వెళ్ళేదోవలో చోళపురము, మొనోజీపేట అనే రెండూళ్ళున్నవి. మనోజీపేటవరకు భాట కిరుపక్కల దట్టమయిన అదివి భాట విశాలముగానున్ను, గులక యిసుక పొరగానున్ను నడవడానికి వైపుగానున్నది. భాట కిరు పక్కల కొంతదూరములో చిన్నతిప్పలున్నవి. మనోజీపేట అనే వూరు బస్తీ అయినది. దేవాలయమున్నది. కొంత దూరములో కొండమీద వెంటెశ్వర స్థలమున్నది.