పుట:Kasiyatracharitr020670mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాటిలో వైష్ణవులకు ప్రతిదినము ప్రసాద మిచ్చుచున్నారు. తిరుపతి భారీగ్రామము. అన్ని వస్తువులు దొరుకును. అన్ని పనివాండ్లు కలరు. పంగులూరు గురునాధ శెట్టి వగైరా సాహుకార్లు వున్నందున షహరుస్థలము రీతిగానున్నది. కోతుల తొందరకలదు. సరసింహ తీర్ధజలమే సానార్హముగాని వేరే లేదు. 2 గడియల దూరములో కపిలతీర్ధమున్నది. అది రమ్య ప్రదేశము. గంగధార సదా పడుచు కింది తటాకముగా నిలిచియున్నది. చుట్టు విశాలమైన మంటపము కట్టియున్నది. అది బ్రాహ్మణ సమారాధనకు యోగ్యమయినది. ఆచుట్టుపక్కల దేశస్థలములలో చందులాలా ధర్మములు నిండాగా జరుగుచున్నవి. గాలి కాలము గనక కొండమీద నొక్క పగలుంటిని. దిగువతిరుపతికి కొండమీద స్వామిగుడి 14 ఆమడ. గాలిగోపురమువరకు నెక్కడము, దిగడము బహుప్రయాస. ఆవల కొంతభూమి సమముగా నున్నది. మళ్ళీ యెక్కడము, దిగడము కలిగియున్నా అంతప్రయాసకాదు. దారిలో నిలుచుటకు జలవసతి గల మంటపాలు చాలాగలవు. గాలిగోపురము వద్ధ నొక్క బైరాగి శ్రీరామవిగ్రహపూజ చేయుచు, వచ్చినవారికి మజ్జిగ మొదలైనవి యిచ్చి ఆదరించుచున్నాడు. వెంకటేశ్వరునికి ప్రార్థనలు చెల్లించే లోకులవలన కొంఫిణీవారికి సాలుకు సుమారు లక్షరూపాయీలు వచ్చుచున్నవి*, కొండమీద యేధర్మ కార్యము చేసుటకున్ను


  • నూరేండ్లనాటి దేవాదాయాలు, ధర్మాదాయాలు:- ఇంగ్లీషు వర్తక కంపెనీవారు మనదేశాన్ని ఆక్రమించిన తరువాత చాలాకాలం వరకు హిందువుల దేవాలయాలను తురకల మశీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్యయంగా పరిపాలించేవారు. దీనిని గురించి కొన్ని కట్టుబాట్లు చేస్తూ క్రీ.శ. 1810 సం|| వంగరాష్ట్రములో నొక శాసనం చేశారు. అలాగే మద్రాసులో 1817 వ సంవత్సరపు 7 వ రెగ్యులేషను అనబడు చట్టాన్ని శాసించారు.. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతోపాటు జిల్లాకలెక్టర్లే వసూలుచేసి దేవుడి ఉత్సవాలు, అర్చనలు, భొగాలు స్యయంగా జరిపించేవారు. మిగిలిన సొమ్ము కుంపినీ వారి ఖజానాలోకి చేరేది. ఈ కలెక్టర్ల పైన రివిన్యూ బోర్డువారికి పై తనిఖీ అధికారం వుండేది. మనదేశంలో ఇంగ్లీషువారి అధికారం బలపడినకొద్దీ దేశ ప్రభుత్వంలో క్రైస్తవ మిషనరీల పలుకుబడి ఎక్కువ కాసాగింది. ఈక్రైస్తవుల ప్రభుత్వం ఇలాగ హిందువుల విగ్రహారాధనను, తురకల మశీదులను ప్రోత్సహించడం అసభ్యంగా వున్నదని మిషనరీలు ఇంగ్లాం