పుట:Kasiyatracharitr020670mbp.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సర్కారుకు రూక యివ్ఫవలెను. అచ్చట పర్మాత్ముడు సంపూర్ణ కటాక్షముతో లోకుల పాపములను వారివిత్తముగుండా హరించి యిష్టసిద్ధిని చేయుచున్నాడు. కొండమీద శ్రీనివాసమూర్థి దివ్యమంగళంగా నున్నది. దేవతలో దేవతలంతవారో, పూర్వము ఆమూర్థి ని ఆరాధించినట్టుతోచుచున్నది. అచ్చట గోసాయి, బైరాగులకు గురుపీఠముగా నుండే మహంతుమఠమొకటి అతి విశాలముగా కట్టియున్నది. ఆమహంతుకు శిష్యార్జన విశేషించి కలదు. కొండమీద యిండ్లు సంకుచితములుగా నున్నవి. చైత్రము మొదలు జ్యేష్టమువరకు ఉదయాన చలిగాలి కొట్టుచున్నది. దానివలన శీత జ్వరాది రోగములు పుట్టుచున్నవి. కోతుల తొందర హేచ్చు. అడవి పందులు నిదుపద్రవముగా మనుష్యులనడుమ సంచరింపుచున్నవి. గాలి కాలములో మనుష్యులు నిండా కొండమీద నుండరు.

30 తేదిరాత్రి ఆమడలో నున్న కరకంబాడు చేరినాను. తిరుపతి వగైరా వూళ్ళ కానలికిగాను ఆ కరకంబాడున్ను, యింకాకొన్ని గ్రామాలున్ను అచ్చటి పాలెగానికి కుంఫిణీవారు జారీగా నడిపించు


మేలో ఆందోళన చేయగా 1833 మొదలు కుంపినీవారు దేశీయ మతములతో జోక్యం కలిగించుకో గూడదనే భావంతో ప్రవర్తింపసాగినారు. గాని తిరుపతి జగన్నాధం మొదలయిన దేవస్థానాల పరిపాలన మాత్రం ఎప్పటిలాగునే కుంపిని ఉద్యోగులు నిర్వహింఛేవారు. తుదకు 1843 లో కుంపినివారు తమవశంలో వుండిన దేవాలయాలను మశీదులను కొందరు ప్రయివేటు వ్యక్తులకు కొన్ని సంఘములకు ఇచ్చివేశారు. ఆ ధర్మాదాయముల తాలూకు తమవద్ద నిల్వ యుండిన లక్షలాది ద్రవ్యం మాత్రము ఇచ్చివేయలేదు. ఆసందర్బంలోనే తిరుపతి దేవస్థానాన్ని అప్పటి మహంతుకిచ్చారు. అంతట ఈ ధర్మాదాయాలు, సరియైన సట్టుబాటులేక పాడైనాయి. ఈ ధర్మాలు స్శిస్తూవున్నా ధర్మకర్తలు సొమ్మును ఎంత దుర్వినియోగం చేస్తూవున్నా కుంపినీవారు జోక్యం కలిగించుకోకుండా వుపేక్షించారు. 1817 వ సంవత్సరపు శాసనమునుబట్టి వానిని, సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యతను గాలికి వదలివేశారు. ఈఅరాచకం ఇరవై సంవత్సరాలు జరిగింది. తరువాత 1863లో ఒక క్రొత్త ధర్మాదాయములచట్టం శాసింపబడింది. ఈ చరిత్రంతా 1871 లో మద్రాసు గవర్నరు కవుంచిలు మొదలైన వెంబాకం రామయ్యంగారు వ్రాసియున్నారు. (31-12-1872 తేదీగల మద్రాసు గవర్నమెంటు జుడీషియల్ ప్రొసీడింగ్సు చూడండి)