పుట:Kasiyatracharitr020670mbp.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంగ్లీషు--తెలుగు పారిభాషిక నిఘంటువు

"వ్యవహారకోశము - శాస్త్రపరిభాష"

530 పుటలు కలసిన సంపుటము వెల రు.2-8-0

రచయిత: దిగవల్లి వేంకటశివరావు, బి.ఏ., బి.యల్.

'మద్రాసు టెక్ట్సుబుక్కు కమిటీవారిచే గ్రంధాలయోపయోగము కొరకామోదింపబడినది.'

(ఫోర్టుసేంట్ జార్జి గెజెట్ సప్లిమెంటు 10-5-59, పుట 253

పెక్కువేల ఇంగ్లీషుపారిభాషిక పదములకు తెలుగు పర్యాయపదములు విపులార్ధములు, నిర్వచనములు గల విజ్ఞానకోశము.

విశ్వవిద్యాలయముల వలనను మద్రాసు స్కూలు ఫైనలు బోర్డువారి వలనను రంగూనుహైకోర్టు వారివలనను ఆదరింపబడి అనేక ఉన్నత పాఠశాల లందును కోర్టు లందును ఉపయోగింపబడువున్నది.

ఇంగ్లీషు తెలుగు తర్జుమాలకు, పాఠములు తెలుగులో నేర్చుటకు అత్యంతోపయుక్తము.

శ్రీ డా|| గుళ్ళపల్లి నారాయణమూర్తిగారు అనకాపల్లినుండి 2-9-37 తేదీన ఇట్లు వ్రాసియున్నారు:-

"విద్యుచ్చక్తినిగూర్చి నేను వ్రాసిన వ్యాసమునకు మద్రాసు విశ్వవిద్యాలమువారు రు. 500 లు బహుమానము నొసగినారని వ్రాయుటకు సంతసించుచున్నారు. దానిని రచించుటలొ మీ పారిభాషిక నిఘంటువు నాకు చాలా తోడ్పడినది. కృతజ్ఞుడను."

"ఇంగ్లీషు తెలుగు తర్జుమాల యవసరము గల ప్రభుత్వశాఖ లందలి అన్ని కార్యాలయములందును గ్రంధాలయములందును ఇతర సంస్థలయందును ఇది అత్యంతావశ్వక మగు ననుటకు సందియము లేదు."

---హిందు. 19-6-34.