పుట:Kasiyatracharitr020670mbp.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"The reader's interest never flags" The Hindu, 19-10-38:

  • "బానిసలుగా వుంచాలనే దృష్టితో సత్యాన్ని కప్పిపుచ్చి కల్పనలు చేసి వ్రాయబడ్డ హిందూదేశ చరిత్రలే నేటి విద్యావిధానంలో ఉపయోగింపబడుతున్నాయి. కాని గ్రంధకర్తగారు శ్రమించి అనేక విషయాల్ని సేకరించి యధార్ధ హిందూదేశచరిత్రని యీపుస్తకంలో పొందుపరచారు. అయోమయంగాను అసత్య భూయిష్టంగాను వున్న గడచిన భారతదేశం యొక్క నిజచరిత్ర తెలిసికొన వలెనంటే యిది చదివితీరాలి.

ఇట్టి అత్యుత్తమ విషయాన్ని చేకూర్తి వ్రాసిన శ్రీ దిగవల్లి వేంకట శివరావుగారికి మా ధన్యవాదాలు" ---గృహలక్ష్మి, జూన్ 1939.

రెండవభాగమును గూర్చిన అబిప్రాయములు

  • "శివరావుగారు న్యాయవాదవృత్తిలో వుండికూడా అవకాశం చేసుముంటూ దేశానికి వుపకరించే గ్రంధాలు చాలా వ్రాశారు. వీరు మన దేశంలో publicists లో ప్రముఖులు. విషయములను బాగా చర్చించి నిష్పాక్షిక సమాధానం చెప్పగలశక్తి వీరికి బాగావుంది. వట్టిమాటలు కాక, చెప్పిన ప్రతి సందర్భాన్ని ప్రమాణాలతో అంకెల పట్టికలతో సమర్షిస్తారు.

భ్రిటిషువారి రాజ్యతంత్రము ఏవిధంగా మనదేశంలో పరిణమించిందో, అభివృద్ధి నిజంగా అభివృద్ధి అవునో కాదో, నూతన ఇండియా రాజ్యాంగచట్టము ఎటువంటిదో చాలా బాగా వివరించారు.

అనేక పూర్వ గ్రంధములు, రెపోర్టులు రికార్డులు, పరిశీలనచేసి ఈగ్రంధము వ్రాసినారు." ---ప్రతిభ, ఏప్రిల్ 1938.

  • "తెలుగుదేశంలో తెలుగువారికి సమస్తవిషయాలు తెలిపే గ్రంధాలు తెనుగుననే ఉండాలని నమ్మి అందుకొరకు శక్తివంచన చేయక పాటుపడుచున్న గ్రంధకర్తలలో శివరావుగారు ఒకరు....

విషయాలన్నీ లెకలతో సహా చక్కగా వ్రాసి ఆంధ్రసేవ చేసారు." ---ప్రజామిత్ర, 12-6-38.