పుట:Kasiyatracharitr020670mbp.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేబిరిగొట్టు, వాపిరిగొట్టు, తంట్రగొట్టు, అని వాడతారు. విశేషణముగా కఠినమైన దుష్టమైన అని అర్థమున్నది = (బ్రౌణ్య).

౯ అవసరాలుగా = రీతులుగా, (బ. ప్ర)

౧౦ చీకారణ్య = కీకారణ్య, (బ. ప్ర)

౧౦ హాశ్శీలు = పన్ను, సుంకము, రుసుము

౧౧ పుంజధాన్యములు = మెట్టధాన్యములు

౧౨ బేబందు = సరియైనకట్టు దిట్టములేని; తారుమారుగా వుండే, (బ్రౌణ్య-మిశ్ర)

" మేటీలు = అంశములు, భాగములు;

" హామీభరాయించి = బాధ్యత వహించి

౧౪ పరుష వాండ్లు, (పర్షవాండ్లు) = తిరుణాళ్లకు వచ్చే గుంపు (పరస = యాత్రకువచ్చు జనము, అని శబ్దరత్నాకరము.)

౧౫ వయిపు; వైపు = ఉపాయము; వీలు; 'వైపు దెలసి బలుక వలయు వేమా', బ. ప్ర.

౨౩ పొలకట్లు = దున్నిన మడులు. సాగుకు దున్నిన పొలము. దీనికి బ్రౌనుగారు కాశియాత్ర చరిత్ర 55వ పుటనే ప్రమాణంగా పేర్కొన్నారు.

౩౧ పేడించు = సేవించు

" చెయికావలి = కాయి కావిలి, చెయిజాగ్రత. ముందు జాగ్రత్త కోసం వుంచుకొనే బియ్యం వగైరా భోజనసామాగ్రి (Reserve) (బ.ప్ర)

౩౩ చేరీనట్టు = ఆనుకొనినట్లు. (బ. ప్ర)

౩౩ గుజరీ అంగడి (౧౬౧) = గుజరి, గుజిరి, గుజలి = బజారు స్థలము; సంతచోటు; గుజలీబజారు; (దొంగల బజారు; బజారువేళ - సాయింత్రము Market Place, Thieving Bazer; a Madras word-బ్రౌణ్య-మిశ్ర.)

" స్తుపీ = మశీదుపైన, బురుజు పైసగల శిఖరము

౩౫ జోరావారి = (జోరావరి) బలాత్కారము; బలోద్దతి

౩౭ అమానిగా = గుత్తకివ్వక దివాణపు విచారణ కింద నుండే భూమి

" మామిలియ్యతు = సర్కారు నిర్వహణము. చూడు; మామిలీయతు (౨౨౮)

౩౮ దివానుపేష్కారు = ప్రధాన పరిపాలకోద్యోగి, సివిలు అధికారి

" నజరు యినాతులుగా = పైయధికారుల కిచ్చు నజరులుగాను; క్రింది వారి కిచ్చు బహుమతులుగాను

౩౯ పారా = కావలి, పారాచౌకీ అనగా కావలిస్థలము

" అంతు = వెరసి (బ.ప్ర)