పుట:Kasiyatracharitr020670mbp.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

వూరు తిరుపతివగైరా వూళ్ళ కావలికెగాను యీ కరకంబాడి దీనితో చేరిన కొన్ని గ్రామాలు ఆ పాళెగాడికి కుంఫిణీవారు జారీగా నడిపిస్తూ వుంన్నారు. వూరు వసతి అయినదికాదు అయిన అవతల కఠినమయిన అడివగనుక విదిల్యాక దిగవలశ్ని మజిలీ అయినది. పోస్టు ఆఫీసు యిక్కడ వుంన్నది యధోచితంగా సామానులు ముసాఫరులకు దొరుకుతున్నది యిక్కడ ముసాఫరుఖానా కట్టివుంన్నది.

31 ది పగులు 6 ఘంటల్కు ముందురత్రి రెండ్డు ఘంటల్కు బయలుదేరి శెట్టిగుంట్ట చేరినాను దోవమిక్కిలి అరణ్య మధ్యంలొ వుండ్డి వుంన్నది. దొంగల రొష్టు మిక్కిలికద్దు. రాతిగొట్టు మార్గంమధ్యే పాలేగాండ్ల వూళ్ళు మామండూరు క్రిష్ణాపురం దోవలో దాటవలశ్నిది. వీరి సహాయం ల్యాక మాతుబరులు నిర్బయంగా యీఅడ్వి దాటలేరు. కలక్కటరుల్కు యీఅడ్విబాట నిర్భయంగా యీఅడ్వి దాటలేరు. కక్కటరుల్కు యీఅడివిబాట నిర్భయంగా చెయ్యడానికి (పుట.7) చాతకాకుండా వుంన్నది మామండూరికి యీవల 5 ఘడియల దూరములో బాలపల్లె అనేవూరు వుంన్నది అది మొదలు కడపజిల్లా సరిహద్దు యీ బాలపల్లె భూమినీళ్ళు బహు రోగప్రదమయినది. యిక్కడ రెండుమూడు నదుల వంట్టి కాలువలు దాటవలెను ఖనమ ఒఖటి దాటవలెను. బాట బహు రాతిగొట్టు యెక్కుడు దిగుడుగా వుంట్టుంన్నది. బహు దట్టమయిన వెదురు అడివి యీ శెట్టిగుంటలో మంచినీళ్ళచెరువు ఒఖటి వుంన్నది రెండ్లు బ్ర్రాంహ్మణ యిండ్లు కలవు ప్యాటస్థళం. కావలశిన సామానులు దొరుకును. బాలపల్లె మొదలు కడప కలక్కటరు అడ్వికొట్టి బాటవెడల్పుచేసి అక్కడక్కడ ఠాణాలు వుంచివున్నాడు. శేట్టిగుంట చేరె వర్కు భాట రాతిగొట్టుగానున్న అడ్విగానున్ను వుంటుంన్నది. కరకంబాడినుంఛ్ఛి ఆపాళెగాండ్లను మంచితనం చేసి యిరువైయింట్కి తుపాకీవాండ్లను శెట్టిగుంట దాకా తెచ్చినాను బాలపల్లెలో ముసాఫరుఖానా వుంన్నది యీదినం పగులు 3 ఘంటల్కు బయలు దేరి సాయంత్రం 7 ఘంటల్కు 1 ఆమడ దూరంలో వుండే కోడూరువద్ద వుండె సత్రం అగ్రహారం చేరినాను. కోడూగు బస్తి ప్యాటస్థళం ముసాఫరుల ఖానా వుంన్నది.