పుట:Kasiyatracharitr020670mbp.pdf/437

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


23

వ్రాతప్రతి - మచ్చుపుటలు

బ్రాహ్మణయిండ్లు లేవు. పయి అగ్రహారంలో యెమీ దొరకదు అంగళ్ళు లేవు భ్రాంహ్మలు శాంతులు కారు.

1 ది జూన్ 5 ఘంటల్కు బయలు వెళ్ళి ఆమడదూరంలో వుండె వోరంబాడు 9 ఘంటల్కు చేరినాను యిక్కడ ముసాఫరుఖానా వుంన్నది ప్యాటస్థళం అన్ని సామానులు దొరుకును బాట బాగానేవున్నది. శెట్టిగుంట నుంచ్చి కోడూరికి రెండుమార్గాలు వఖటి అడ్విలో దండుభాట వఖటి పల్లెలమీద కాలిబాట. యీ కాలి భాటలోను సవారీలు రావచ్చు(పుట.8)ను అడ్విభయం కోడూరితో సరి. యివతల భూమి తెరపగా దగ్గర గ్రామాలు పయిరుపొలం వుదకవసరి యిది మొదలయినది. భాటలో కోడూరి మొదలు కలిగి వుంన్నది యక్కడ చూచినా చింతచెట్లు కలవు బాలపల్లెవద్ద వుండ్డె కొండ వాగునీళ్లు నాబోయీలు వగైరా తాగినంద్దున వఖ బోయి వక కావడివాడు జ్వరం తిగిలి ఖాయిలా పడ్డంద్ను సమీపవతుగావుండె వోరంబాడిలో మధ్యాంన్నం నిలిచినాను యీ బాలపల్లెవద్ద వుండె కొండవాగువద్ద రాతిగొట్టు కనుమ వుంన్నది వాటివద్ద శ్రీనివాసమూర్తి పాదం వుంన్నది. అక్కడ నుంచ్చిపడమటి దేశస్తులు కొండ్డయెక్కుతారు యీదినం 3 ఘంటల్కు బయలు దేరి ఘడియప్రొద్దువుండగా పుల్లంప్యాట చేరినాను 4 ఘడియలు దూరం ముసాఫరు ఖానావుంన్నది ప్యాటస్థళం బ్రాంహ్మణయిండ్లు కలవు. (ఈముద్రణం పుటలు.2-3) ---

వ్రాతప్రతి పుటలు 44-50 (చూడు.ఈముద్రణం పుటలు. 32-36)

జూన్ 26 ది మంగళవారం రాత్రి మొదలు జూలాయి యనిమిదొ తేదీ మంగళ్వారం సాయింత్రంవరకు హయిదరాబాదు షహరుతో చేరిన బేగంబాజారులో వుంన్నాను ఆ రాత్రి మొదలు జూలాయి 13 ది సోమవారం రాత్రివరకు శికింద్రాబాదు అనే పేరుగలిగిన యింగిలీషు వారిదండు వుండె బస్తీకి సమీపంగా వుండె కాకాగూడం అనే బొమ్మదేవరు నాగన్నతోట చావడిలొ వుంన్నాను. యీ హయిదరాబాదు షహరుకు చుట్టు బేగంబజారు అనే బస్తీ 1 సాహుకార్ల కొఠీలుకలది వుంన్నది యిది షహరు ఆపేక్షయా