పుట:Kasiyatracharitr020670mbp.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21 వ్రాతప్రతి - మచ్చుపుటలు

చుట్టూ విశాలమయిన మంట్టపం కట్టివుంన్నది భ్రాహ్మణ సంవారాదనకు అతియోగ్యంగా వుంన్నది యీ చుట్టుపక్క దేవస్థళాలలో చందులాలా ధర్మాలు నిండాగా జరుగుతున్నది ఘాలికాలంగనుక కొండమీద ఒక పగులు వున్నాను దిగువ తిరుపతినుంచ్చి కొండమీద స్వామివుండెప్రదేశం 24 ఆమడ ఘాలిగోపురంవర్కు యెక్కుడు దిగుడు బహు కష్టం ఆవల కొంతప్రదేశం సమభూమిగా వుంటున్నది మళ్ళి యొక్కడం దిగడం కలిగినా ఘాలిగోపురంవర్కు కలిగినసంత ప్రయాసకాదు దారిలో నిలవడానికి అనేక మంట్టపాలు వుదక వసతి కలిగివుంన్నది ఘాలి గోపురంవద్ద ఒఖ బయిరాగి శ్రీరామవిగ్రహాలను ఆరాధిస్తూ వచ్చిన వారికి మజ్జిగ మొదలైనది యిచ్చి ఆదరిస్తూవుంన్నాడు. యెగువ తిరుపతిస్వామికి చెల్లుబడిఅయ్యె ప్రార్ధనలవల్ల కుంఫిణీవారికి సుమారు లక్షరూపాయలు వస్తూవుంన్నది యె సత్కార్యం యెగువ జరిపించ్చడానికి సర్కార్కు రూక యివ్వవలశి వుంన్నది యిక్కడ పరమాత్ముడు సంపూర్ణ కటాక్షంతో ప్రతిఫలించ్చి లోకుల పాపాంన్ని వారివిత్తం కుండాహరించ్చి యిష్టశిద్ధి చేస్తూవుంన్నాడు. వుండె శ్రీనివాసమూర్తి ప్రతిమె దివ్యమంగళ విగ్రహంహంగ్గా వుంన్నది దేవతులో ల్యాక దేవతులకు సమానమయిన వారో గత కాలంలో ఆమూర్తిని ఆరాధించ్చినట్టు తోస్తుంన్నది యిక్కడ గోసాయి బయిరాగులకు గురుపీఠంగావుండ్డె మహాంత్తుమఠం వకటి అతివిశాలంగ్గా కట్టి వుంన్నది ఆ మహంతుకు సిష్యార్జన విస్తారం కలదు. యిండ్లు నంకుచితం చైత్రమాసం మొదులు జ్యేష్టమాసంవర్కు వుదయకాలమంద్దు చ (పుట.6) చల్లని ఘాలికొట్టుతుంన్నది. అది శీతళించ్చి కొండమీద వుండెవారికి నిండ్డారోగప్రద మవుతున్నది. కోతుల వుపద్రవం విస్తారం. అడివిపందులు నిరొపద్రవంగ్గా మనుష్యుల మధ్యే సంచరిస్తూవుంట్టున్నది ఘాలికాలంలో మనుష్యులు నిండా కొండమీద వుండడం లేదు కొండమీద అరతిరుపావడ 220 రూపాయిలు యిచ్చి విడిచి దక్షిణనసమేతంగ్గా ప్రసారం వినియోగం చేయడమయినది.

30 ఆదివారం రాత్రి కరకంబాడి చేరినాను దిగువతిరుపతికి ఆమడ దూరానికి కొంచ్చం తక్కువగా వుంన్నది యిది పాళెగాడి