పుట:Kasiyatracharitr020670mbp.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమస్త విధములయిన పనివాండ్లు వున్నారు. మరునాడు యావత్తు యిక్కడ వసించినాను.

27 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమణ్నరదూరములో వుండే మనుబోలువద్ద కృష్ణమాచార్యుల సత్రము 7 గంటలకు చేరినాను. యీ సత్రము బహువసతిగా వున్నది. సమస్తపదార్ధాలు దొరికినవి. యిక్కడ వంట, భజనములు కాచేసుకుని యిక్కడికి ఆమడ దూరములో వుండే గూడూరు జాములో చేరినాము. గూడూరు పెద్దదైనా అనావృష్టి కాలములయందు నీళ్ళకు బహు ప్రయాస. బావులు లేవు. ప్రయాసమీద బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరికినది.

రాజమహేంద్రవరము వదిలినది మొదలు నియోగుల కర్ణీకపు వుద్యోగము కలవారై పూర్వోత్త్రరమునుంచి ప్రబలులుగా వుండడము వల్ల గొప్ప యింఛ్లు కట్టుకొని వున్నారు. వీరి ప్రారబ్ధవశమువల్లల్ భాటసారులకు స్థలము యిస్తేతమకు పరువుతక్కువాని వొక బుద్ధి జనియించి యిల్లు గొప్పగదా అని అవరైనా వెళ్ళి స్థలము అడగపోతే బ్రాహ్మణ యిండ్లకు పొమ్మంటారు. మీరు బ్రాహ్మణులుకారా అని ప్రశ్నచేస్తే కాదు మేము కరణాలము, స్థలములేదు పొమ్మంటారు. యీ వూళ్ళో రెడ్లు ప్రబలముగా వున్నారు. వొక దేవాలయ మున్నది. యిక్కడ యీ రాత్రి వొక బ్రాహ్మణయింట్లో వసించినాను. దారి సడక్కువేశి శాలపెట్టి వంటల్లూరు మొదలుగా వొక్కతీరుగా గులకపరచి వారధులు కట్తివున్నవి.

28 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 24ఆమడ దూరములొవుండే నాయడిపేట అనే వూరు 9 గంటలకు చేరినాను. యిది పేటస్థలము. సమస్త పదార్ధాలు దొరుకును. మనుబోలు మొదలుగా వెంకటగిరిరాజు వారి భూమి. యె పేటలోను, వారి సదవృత్తి అన్నసత్రము, నగెరున్ను వున్నది. యిక్కడ బోజనము చేసుకుని 6 గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి కోసెడు దూరములో వుండే బ్రాహ్మణ పుదూరు చేరినాను. యీవూరు దారి కాక పొయినా 50 యిండ్లు విద్యన్మడలి వుండే గ్రామము గనుకనున్ను