పుట:Kasiyatracharitr020670mbp.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాపరివారల స్వకీయులు కొందరు అక్కడ వున్నారు. గనుకనున్ను యీ వూరికి రావడమయినది. యిక్కడ అనాది దేవాలయాలు 2 ఆబ్రాహ్మణుల పేదరికమునకు తగినట్టి కాపాడబడుచున్నవి. యీ బ్ర్రాహ్మలకు ఈ గ్రామము శ్రోత్రియము. ఈ వూళ్ళో 29 తేది మధ్యాహ్న పర్యంతము నిలవడమయినది.

కృష్ణ మొదలుగా గూడూరివరకు తాగ నీళ్ళులేవని జనులు హాహాకారపడుతూ వుండినారు. ఇవతల నాయడిపేట మొదలుగా యెక్కువ వర్షాలు ప్రతిదినము కురుస్తూ వున్నవి. జగదీశ్వదుడు యీ చొప్పున పాత్రాపత్రములు యెరిగి జీవనాదానము చేయుచూ వున్నాడు. కాల నష్టములకు కారణము అనేకవిధాలా విచారించగా రాజధర్మము ప్రజల నడవడికె యీ రెండుకారణాలున్ను ముఖ్యములని తొచబడుచున్నది. గూడూరు మొదలుగా దారి సడక్కుకాదు. యిసక కలిసిన రేగడ. నాయుడిపేటవద్ద సువర్ణముఖరీనది దాటవలసినది. యేరు అరగడియ దూరము వెడల్పుకద్దు.

నెల్లూరు మొదలుగా అరవమాటలు వింటూ వస్తారు. యీ వూరికి ఆ వూరు యిన్ని గడియల దూరమని చెప్పుతారు. కోసులమాట నిలిచిపోయినది. వుత్తరపినాకిని మొదలు దక్షిణపినాకిని వరకు మధ్య దేశముగా తోచుచున్నది. యీ దేశాములో పడమటి నుంచి కన్నడము వచ్చి కలిసినది. దక్షిణము నుంచి అరవము వచ్చి కలిశినది. వుత్తరము నుంచి తెనుగు అదే రీతుగా వచ్చి కలిసినది గనుక యీధ్యదేశపు భాష యీ మూడు భాషల మిశ్రమయి యీ మూడు భాషలు యీ దేశస్థులు వచ్చి రాక ఆ యా దేశములోకి వెళ్ళి మాట్లాడపోతే ఆ యా దేశస్థులు హాస్యము చేయసాగుతారు.

29 తేది మధ్యాహ్నముమీద 3 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే దొరవారి కోనేరు అస్తమానానకు చేరినాను. యిక్కడ వెంకటగిరి రాజు వొక గుంట తొవ్వించినాడు. అందులో యెన్నడికి అరోగ్యముగానున్ను, రుచికరముగానున్ను ఆరోగ్యకరముగానున్ను వుండే వుదకము కలిగివున్నది. యిక్కడ వారు కట్టివుండే సత్రము చావిళ్ళు యధోచితముగా విశాలములై వున్నా