పుట:Kasiyatracharitr020670mbp.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిక్కడి రాజుముందర సాక్షి చెప్పి ఆ కులీనుడుకి కులీనుడికన్యను తీసి యిచ్చి వివాహము చేసినట్టున్ను అదునిదలుగా యిక్కడ గోపాలమూర్తి విలశిల్లి అంగుళియ్యముతో గీచి, నదిని కలగచేశి భక్తవత్సలుడుగా వుండేటట్టు వాడుకుంటారు. మత్స్యదేశపు బ్రాహ్మల యిండ్లు యీవూళ్ళో 100 కడపదాకా వున్నవి. యీ మూర్తికి పిష్టపక్వాన్నము నైవేద్యముగాని ప్రత్యక్ష అన్నము నైవేద్యము చేసే వాడికెలేదు.

21 తేది వుదయాత్పూర్వము 4 గంతలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములోనుండే జగన్నాధ మహాక్షేత్రము వుదమయిన రెండు గడియలకు చేరినాను. దారి సడక్కు వేసియున్నది. క్షేత్రానకు కోశెడు దూరములో తులసీదాసు అనే మహాపురుషుడి సమాధి వున్నది. అక్కడ జగన్నాధస్వామి స్థూపీమీదనుండే చక్రదర్శనము అవుతున్నది. అక్కడి స్థలవాసులకు యధోచితము దక్షిణయిచ్చి చక్రదర్శనము చేయవలశినది. అటారానాళాఘాటు కుండా క్షేత్రము ప్రవేశించినాను. ఆఘాటులో యాత్ర్ర వచ్చినవారివద్ద హశ్శీలు పుచ్చుకొనే కచ్చేరి వున్నది. అక్కడ మనుష్యులు గణన చేయించుకొని హాశ్శీలు యిచ్చి చీటీచేయించుకుని స్థలము ప్రవేశించవలసినది.

యీ జదన్నాధ మహాక్షేత్రమాహాత్మ్యము పురాణ సిద్ధముగా యిప్పుడు తెలియడము యేమంటే పూర్వకాలమందు యీ భూమి అతిఘోరమయిన దండకారణ్యముగా వుండినది. అందులో నీలాద్రి అనే పేరుగల పర్వతము వొకటి వున్నది. అందులో నీలమాధవస్వామి అనే మూర్తి నివాసము చేయుచు కిరాతకులవల్ల ఆరాధన చేయబడుతూ వుండినట్తున్ను యిట్లా వుండాగా యిక్కడికి బహు దూరప్రాంతమందున్న యింద్రధ్యుమ్న మహారాజుకు యీమూర్తి ప్రభావము ఈస్థల ప్రభావమున్ను తెలిశి నిశ్చయముగా చూచి విచారించి వచ్చేకొరకు వొక బ్రాహ్మణ్ని పంపించినాడు. పూజ చేయుచున్న కిరాతకులకు నీలమాధవస్వామి తత్పూర్వము నన్ను యెప్పుడు బ్రాహ్మడు వచ్చి దర్శనము చేయుచున్నాడో అప్పుడు మీ అధీనము వదిలిపోతానని