పుట:Kasiyatracharitr020670mbp.pdf/345

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చెప్పివుండినాడు. గనుక యింద్రద్ద్యుమ్న మహారాజువల్ల పంపించబడ్డ బ్రాహ్మడు తన్ను బ్రాహ్మణుడని తెలిస్తే కిరాతకులు హింసింతురనే భయముచేత ప్రచ్చన్న వేషుడై యీ దండకారణ్యము ప్రవేశించి స్త్రీలు మాయాశక్తి చైతన్య పరిపూర్ణులై సమస్త కామక్రోధ కలహాలు పురుషులకు కలగచేశేవారు గనుక వచ్చిన బ్రాహ్మణుడు కిరాతక రాజుకొమార్తెను స్వాధీనపరచుకుని కిరాతకులవల్ల అర్చింపబడే నీల మాధవస్వామిని దర్శనముచేసి తన రాజుకు సమాచారము చెప్పను వెళ్ళినాడు. ఇంతలో నీలాద్రిపర్వతమున్ను నీలమాధవస్వామి మూర్తిన్ని సముద్రసైకతమువల్ల అంతర్ధానమైపోయి సముద్రతీరమందుండే చక్రతీర్థమువద్ద బలభద్ర కృష్ణసుభద్రల మూడు కళీబరాలున్ను కొంతమట్టుకు దహనమై కొంతకాలకనిలిచి అవి దారుమొద్దువలెనే ఆకారములు కలిగినవిగా కొట్తుకునివచ్చి పడివుండగా అందులో నీలమాధవస్వామి చైతన్యాంశలు ప్రవేశించివుండింవి. ఆవయినము ముఖ్యకిరాతకులకు తెలిసి ఆ దారుమొద్దులను తెచ్చి మృదంగవతుగా వక్షస్థలములయందు ధరించి వాటిని వాయిస్తూ ఈశ్వరభజన చేయుచూ వచ్చినారు. ఇట్టి సమయమందు యింద్రద్యుమ్నరాజు యీ స్థలము ప్రవేశించి నీలమాధవస్వామి అంతర్ధానమయిన వర్తమానము తెలిసి ఖిన్నుడై బహు తపస్సుచేసి మళ్ళీ నీలమాధవస్వామి ఇక్కడ విలసిల్లుతావని వాకు ఇచ్చినందు మీదట యిప్పుడుదృశ్యముగా వుండే మందిరములు కట్టి మళ్ళీ బహుకాలము తపస్సుచేయుచూ నుండగా యీ మందిరాలు పర రాజు స్వాధీనమై పోయినవి. మళ్ళీయీమందిరలనున్ను కిరాతకుల స్వాధీనముగా వున్న దారువులనున్ను యింద్రద్యుమ్నరాజు సంపాదించిన వెనుక విశ్వకర్మ వృద్ధ స్వరూపముగావచ్చి ఆ దారుమొద్దులను బింబాలు చేస్తూవుండగా విశ్వకర్మ నియమించిన కాలము వరకు మనసు తాళక అతను పనిచేసే ఆలయము తెరిచి చూచినందున సగము మట్టుకైన పనితో ఆ మొద్దులను యథోచితముగా బింబాకృతి చేసి విడిసిపెట్టి విశ్వకర్మ పోయినాడు. తర్వాత ఆరీతిగావుండే బింబాలలోనే మూర్తీభవిస్తానని అశరీరవాక్కుగా యీశ్వరాజ్ఞ అయినందున బ్రహ్మపురస్సరముగా ఆ మూర్తులను యింద్రద్యుమ్న రాజు