పుట:Kasiyatracharitr020670mbp.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేరినాను. యీవూరు చిన్నదైనా అన్ని పదార్ధాములు అప్రయత్నముగా దొరికినవి. కుంఫిణీవారు విశాలమైన ధర్మశాలలు రెండుమిద్దెలు కట్తించివున్నారు. నేటిదారిన్ని సడక్కువేసియున్నది. సువర్ణనది కాలువ నడకగా దాటినాము. నదికి యీ పక్క మంకపుచౌకీ వొకటి యున్నది. వొకమాత్రపు వారిని సోదాచూడడమనే సాకుపెట్టి కొంత గుంజుకోకనే ఆ చౌకీదారులు వదలరు. నేటిదారిలో భాటకు కుడిపక్క కొంతదూరములో వొక పర్వతము తెలుస్తూ వచ్చుచున్నది.

కలకత్తాలో నేను వుండగా వొకదినము గాలితోకూడా రాళ్ళ వాన కురిశి గచ్చకాయలంతేశిరాళ్ళు పడ్డవి. ఆరాళ్ళు పది అయిదు యెత్తి వొకపాత్రలోవేశి కుదిలించితే రాళ్ళు రాళ్ళు కుదిలించినట్టు చప్పుడౌతున్నది. కిందపెట్టి బళువైన పదార్థముతో కొట్టితేనీళ్ళయిపోతున్నవి గాని దెబ్బకు తాళనెరవు. చేత పట్టుకుంతే తూటుపొయ్యేపాటి శీతళముగా శుద్దస్ఫటిక నంకాశముగా వున్నది. గడియవుంచితే క్రమక్రమముగా కరిగిపోతున్నవి. మళ్ళీ అటువంటి నాన ప్రసక్తించలేదు. కలకత్తాలో కలిగివున్న పిశాచగాలిన్ని యిక్కడలేదు.

కలకత్తాలో నేను వుండగా మలడీ అనే జ్వరము కలకత్తాలో నంతా ప్రవేశించి నా పరివారములో యివవైమందిని బాధపెట్టినది. గయలో వొక నల్ల డాక్టరు నాకు చెప్పిన ప్రకారము హిందూస్థాని భాషలో చిరటా అనిన్ని యింగిలీషులో బిట్టరు అనిన్ని చెప్పేమూలిక వేశి కషాయముపెట్టి యిలిక్కిసియా విత్రిల్ అనే ద్రావకము వొక క్వార్టర్ బాటిల్ కషాయానకు రెండు తేగరిటెలు పోశి సాయంప్రాత: రెండేసి తులాలు యిస్తూ వచ్చినంతలో ఈశ్వర కటాక్షముచేత అందరికిన్ని అనాయాసముగా వాశి అయినది. వొక బోయివాడికి నీరుకు బదులు నెత్తురు దిగుతూ వచ్చినంతలో బొందెగడ్డ రసము తీసి తవ్వెడు రసములో మూడు బొట్లు గంధకద్రావకము పోశి యిచ్చినాను. త్వరలో వాశి అయినది.

11 తేది వుదయాత్పూర్వము 2 1/2 గంటలకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములో వుండే బాలేశ్వరమనే కసుబాబస్తీ 9 గంటలకు చేరినాను. దారి యీవరకు వున్నట్టు సడక్కు యేర్పడి వుండడములో