పుట:Kasiyatracharitr020670mbp.pdf/332

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భూమి యిసుక కలిసిన రేగడ గనుక బహు గట్టిపడి వర్షము కురిశివున్నా కాలికి అంటుకోకుండా వున్నది.

కలకత్తా మొదలుగా సువర్ణనది వరకు భూమి జిగట రేగడి, అందువల్ల కలకత్తాలో కోశే యిటికెరాళ్ళు బహుగట్టిగా రెందుమూళ్ళ చచ్చౌకముగా కొయ్యగల పాటివైపు కలిగివున్నవి. కలకత్తా యిటికె రాళ్ళు యినుప చిట్టముతో సమమైన బలము కలవని చెప్పవచ్చును. కలకత్తా సున్నము మాత్రము ధావశ్యము చాలదు గనుక యింటి గోడలు చెన్నపట్టణము వలె నీడలు తేరడము లేదు.

దేశాస్థులందురున్ను గుల్లసున్నము వేసుకొంటారు. యీ విషయాన్ని గురించి ఒక దినము బంగాళీవారు మీ దేశములో బ్రాహ్మణులు మత్స్యభక్షణ చేయడములేదంటిరే, గుల్లసున్నము తాంబూలచర్వణముతో తినడములేదా అని అడిగెను. నా అనుభవద్వారా కావేరి మొదలు కన్యాకుమారి వరకు సమస్త బ్రాహ్మణులున్ను దేశాచారప్రకారము గుల్లసున్నము వేసుకుంటారని తెలిసి నేను ఆ దేశ సంచారము చేసినప్పుడు వారితోటిపాటుగా అదే సున్నము వేసుకొనివున్నా బంగాళీవాడుచేసిన ప్రశ్నమహిమను యోచించి మా చెన్నపట్టణములో గుల్లసున్నము వేసుకోవడము లేదని వుపాయముగా వుత్తర్వు చెప్పినాను గాని నా మనస్సుమాత్రము కలతబడి వున్నది. గుల్ల లున్నూ జలజంతువుల కళేబరాలతో చేరినది నిజమేకదా! యీ దేశస్థులు మత్స్యకళేబరాలను పచనముచేసి తింటే దక్షిణదెశస్థులు వాటి దేహాలమీది చిప్పలను కాల్చి తింటారు. ఈ రీతిగా పరోక్ష ప్రత్యక్షాలుగా జలజంతువుల కళేబరాలను వొక పక్కది వొక దేశస్థులు వొకవిధమయిన పచన ద్వారా భక్షణ చేస్తే మరివక దేశస్థులు మొరివొకపక్క కళేబరాన్ని మరివొక విధమయిన పచనముతొ భక్షణ చేయుచూ సమమైన పాపులయివున్నా వొకరిని వొకరు నిమిత్తము మాలి నిందింపుచూ వుంటారు. యీసరికి నావద్ద ప్రయాగనుంచి తెచ్చిన రాతిసున్నము వున్నది. యిది ఖర్చు అయిన వనక బంగాళి వాడివల్ల ధర్మసూక్ష్మము యెచ్చరించబడ్డా యుక రాతిసున్నము దొరకక పోతే దేశాచారాన్ని లోగడివలెనే అనుసరించవలసి వస్తున్నది.