పుట:Kasiyatracharitr020670mbp.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మము లేదు గనుక సమస్త జగదాధార మయిన వస్తువు అవాజ్మానస గోచరమై శుద్ధశూన్యముగా ధ్యానించ పడి వున్నది. గనుక నున్ను నాస్తికులు ప్రపంచము యే స్వభావముచేత జరుగుచున్నదని అంటారో ఆ స్వభావాన్నే జ్ఞానులకు సహపాకులే గాని వేరే కాదు.

యేప్రల్ నెల 1 తేది కృష్ణనగర మనే గొప్ప వూరు చేరి నాను. ఈ వూళ్ళో యిక్కడి రాజు అనే వొక జమీందారుడు వున్నాడు. శానా అంగళ్ళు వున్నవి. సకలపదార్ధములు దొరుకును.

యిక్కడ కుంఫిణీవారు వచ్చేవానాలు వగయిరాలకు వాటిదాంట్ల సంఖ్యమీద నున్ను, నావాల గాత్రములమీద నున్ను నిరుకులు యేర్పరచి టల్లా అనే తీరున తీస్తారు. ఆ సుంకము తీరువ వసూలు చేయడానకు వొక కలకటరు యీ వూళ్ళో వుంటాడు. ఆ టల్లా అనే తీరువ నిమిత్తము నా బజరాకు వుల్లాకు అనే వాడకున్ను యేడున్నర రూపాయి యిచ్చినాను. యీ ప్రకారము వసూలు చేసే తీరువ రూకలకుండా కుంఫిణీవారు శిబ్బంది వుంచి జలంగినది అనే పేరు కలిగిన గంగాదారలో నుంచి బదరుగంజు వద్ద చీలే ప్రదేశము మొదలు నదిలో మిట్టలు పెట్టకుండా సూత్రపు పడవలకుండా మన్ను యెత్తి పారవేసి నావాలు రావడానకు వయిపు చేయుచుంటారు. యీ జలదంగి నది ధార చిన్నది గనుక ఈ వుపాయము కుంఫిణీవారు చేయడము బహు అగత్యముగా నాకు తోచినది. మన్నుయెత్తే సూత్రపు పడవ వోకటి బదదుగంజువద్ద వున్నది. ఆ పడవకు గొప్ప పారచిప్పలను మాత్రము కట్టి తగిలించి వున్నారు. పడఫలలో మనుష్యులు సూత్రపు తాళ్ళు పట్టి యీడిస్తే ఆ పారచిప్పలు మన్ను తొవ్వి పడవలో తెచ్చి వేస్తున్నది. సూత్రపుపడవ తయారిచేయడానకు యిరువై వేల రూపాయలు ఖర్చుతగిలి వుండునని తోస్తున్నది.

.