పుట:Kasiyatracharitr020670mbp.pdf/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పోతూ వుంచున్నవి. కొందరు యింగిలీషు దొరలు సుందరవనపు నరిధార పూర్వోత్తరములు తెలిసినవారిని కలకత్తాలో బజరాల మీద యెక్కించుకుని గంగాభావానిలో యీ నీళ్ళ తగ్గుసంబంధమైన శ్రమను పొందకుండా కలకత్ తనుంచి కాశికి ఢిల్లీ మొదలైన దేశములకు వెళ్ళుచున్నారు. యీ గంగామహానదిలో గొప్ప దేహములు కల మొసళ్ళు, కూర్మములు, మత్స్యములున్ను అమితముగా వున్నవి. వొక గొప్ప మత్స్యమును నా బజరామల్లాలు గాలమువేసి పట్టిరి. అది పురుష ప్రమాణము పొడుగున్ను, అందుకుతగ్గ లావున్ను గలిగి వుండినది. దాని కళేబరమును నాతోకూడావున్న పరిజనము సుమారు యిన్నూరుమంది రెండు మూడు దినములుగా భక్షణచేసినారు. యింత గొప్ప జలచరములు గంగలో వసించినా యెవరినిన్ని హింసపెట్టినట్తు యీవరకు వదంతి లేదు. సుందరవన మనే అడివిమధ్యే ప్రవహించే గంగలో సముద్రసంబంధమైన జలచర జంతువులుకూడా వచ్చి ప్రవేశించి వుంచున్నవి గనుక అవి మనుష్యులను బాధపెట్టుచున్నవని చెప్పుతారు. యీ జలచరజంతువులేమి, కౄరములైన స్థలచరజంతువులేమి వీటి ఆత్మలలో పరమాత్మ ప్రతిభాతి ప్రవ్యక్షముగాలేక వుండుటచేత జ్ఞానవిహీనమిలైన చిన్నదేహాలను పెద్దదేహములు భక్షణచేయుచూ యితరులకు వుపద్రవకరములుగా వుంచున్నవి. మనుష్యులు మాత్రము జ్ఞానయుక్తులై వుండేటందువల్ల పరస్పరభక్షణ లేకుండా, ప్రకృతిలేక యంత్రవత్తుగా వుండే అజ్ఞాన జంతు దేహములను దూరము విచారించి తమ ప్రభావము తెలుసుకునేదాకా భక్షిస్తూ జ్ఞానోదయము స్ఫుటముగా కలిగినవెనకగాని సంకేత బోధనవల్లగాని అటువంటి భక్షణలను చాలించి అగ్నిమహాభూతసృష్టితో చేరిన సన్యాదులు భక్షిస్తూ వచ్చి పిమ్మట తుర్యదశను పొందినవెనక హఠయోగరాజయోగలంబికా యోగములచేత తమలోని వాయువునే తాము భక్షణ చేయుచు దివ్యదేహధారణ చేసి వుంటారు.

యీ జలంగినది అనేక తిరుగుళ్ళుగా ముందువచ్చి వెనకకు పోతూ వుండే టందున యిందులో బజరామీద వచ్చేటప్పుడు బజరా తిరుగుడువల్ల సూర్యబింబము వొకపక్కనుంచి మరివొక పక్కకు


.