పుట:Kasiyatracharitr020670mbp.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేహాలకు బ్రహ్మానుసంధానము చేయదగిన శక్తి పుట్టే వరకు భగవద్గీతా వాక్యమైన 'వాసాంసిజీర్ణానీ అనే వాక్యప్రకారము దేహాంతరములు కలవు. ఆప్రకారము పరతత్వమువల్ల సృష్టిచేయబడిన ప్రకృతిదేహాల రక్షణనిమిత్తము గాను వాయు మహాభూతము తిర్యగ్జంతుకోటి అయిన పశువులు మొదలైన ప్రత్యక్ష జీవరాసులను సృష్టించెను. అవి పరతత్వముయొక్క సృష్టి కావు గనుకనున్ను పశువులు మొదలయిన దేహములలో పరతత్వముయొక్క ప్రతిభాతి కాతగ్గ ప్రకృతిలేదు గనుకనున్ను ఆ జంతుకోటికి దేహాంతరాలున్ను లేవు. యంత్రములవలెనే వాటిలో ప్రాణవాయువు నిలిచివుండే వరకున్ను చరింపుచు నుండి దేహములో ప్రాణవాయువు వదలగానే దేహాంతరములేక యంత్రము పగిలిపోయినట్టు విచ్చిన్నమై పొవును. అయితే తిర్యగ్జంతు కోటి ముఖ్యమయిన మహా వాయుభూతముయొక్క సృష్టి గనుక నున్ను ఆ జంతుకోటిలో ఆకాశభూతవ్యాప్తి ప్రత్యక్షముగా లేకపోయినప్పటికిన్ని వాయు మహాభూత సమేతముగా కొదవ నాలుగు మహాభూతముల వ్యాప్తి సంపూర్ణముగా నుండుటచేత ఆ జంతుకోటి దేహములలో పంచేంద్రియములు గలిగి ఆ యింద్రియాల ప్రేరేపణచేత ఆహార నిద్రాభయ మైధునాదులున్ను బాల్య యౌవన కౌమార వార్ధక దశలున్ను వాటికి కలిగి వున్నవి. అయితే అవి తల్లి బిడ్డ అనే వ్యవస్థలేక మూఢత్వముతో చిన్నదేహాలను పెద్దదేహాములు ఆహారము చేసికొంటూ వుంచున్నవి.

పరతత్వము యొక్క సృష్టిఅయిన ప్రకృతిదేహుల సంరక్ష్ణార్ధమని ఆ ప్రకారము వాయుమహాభూతము సృష్టించిన తిర్యగ్జంతుకోటిచాలదని తోచి అగ్ని మహాభూతమువల్ల వృక్షాదులు ఓషధులు సన్యాదులు, తృణాదులు మొదలయిన అచేతన వస్తుకోటి వాయుభూత సృష్టియైన జంతురక్షణకొరకు సృష్టించబడినది. తద్ద్వారా అగ్ని సృష్టించిన వృక్షగుల్మ సస్యాదులున్ను, పరతత్వవ్యాప్తిన్ని, వాయుభూతవ్యాప్రిన్ని అంతు రెండు వ్యాప్తులున్ను లేనందున పంచేంద్రియ వ్యాపారములు తజ్జనితమైన ఆహార నిద్రాభయ మైధునముల్ లేక్ నున్ను జాగ్రత్స్వప్నసుషుప్తులనే అవస్థా త్రయము లేకనున్ను స్థావర రూపములను వహించి బాల్యము యౌన