పుట:Kasiyatracharitr020670mbp.pdf/301

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సముద్రసంచారులుగా నుండే జాతులవాండ్లు సముద్రములో వుండే ప్రదేశాంతరములు గుర్తు తెలిసే కొరకు బ్లాకిసీ, రెడ్డుసీ అని పేళ్ళు పెట్టినట్టు మన పూర్వపు పౌరాణికులు దేవతలు మొదలైన సిద్ధస్వరూపులు వసించే ప్రదేశములు ఈ బ్రహ్మాండములో ఫలాని తావులు అని గుర్తు తెలిసేకొరకు వొక జలరాశిలోనే యిది లవణ సముద్రముయిది యిక్షు సముద్రమని యేర్పచినట్టున్ను ఆ మధ్యనుండే దివ్యభూఖండములను జంబూ ప్లక్ష అనే సప్త ద్వీపాంతరములుగా యేర్పరచినట్టుగానున్ను తోచబడుచున్నది.

సృష్టియొక్క క్రమము విచారించగా మొదట అయిదు మహా భూతములు వుద్భవించినవి. వాటిపేళ్ళు పృధిన్యప్తేజోవాయ్వాకాశాలు. ఆకాశభూతము శుద్దశూన్యమయినా సర్వవ్యాపకముగనుక అదే పర తత్వమైయుపనిషద్వాశ్య ప్రకారము తనవల్ల వాయువు దానివల్ల అగ్ని, దానివల్ల జలము, దానివల్ల భూమి అని యిట్లు సృజించెను. ఆకాశము గాక మిగిలివుండే నాలగు భూతములలోనున్ను వాటియొక్క సృష్టి పరంపరలోనున్ను ఆకాశ మహాభూతముయొక్క సంకల్ప స్వరూపమైన మాయాశక్తిన్ని, సర్వకారణమైన ఆకాశ భూతమున్ను లీనములై యున్నవి. వాయువుమొదలైన మహాభూతములు నాలుగింటిలో మాయాశక్తి చైతన్యము విస్తారము ప్రతిఫలించే స్త్రీ భూతములు తెండు; ఆకాశభూతసంబంధమైన పురుష చైతన్యము విస్తాఅరము ప్రతిఫలింఛే పురుష భూతములు రెండు; అంతు మహా భూతములు నాలుగు. అందుకు దృష్టాంతము యేపురాణములో విచారించినా భూమినిన్ని వుదకరాశినిన్ని స్త్రీలింగాలుగా చెప్పుతూ వచ్చినారు. ఆ అయిదు మహాభూతముల ద్వారా సంకల్ప ప్రకారము అనేక బ్రహ్మాండాలను సృష్టించి వాటిలో అంతర్భూతమయిన అనేక కోటి ప్రకృతిగల పిండాండాలను పరమాత్మ యనే ఆకాశ భూతముసృష్టించినది.

ఆప్రకారము సృష్టి అయిన అనేక బ్రహ్మాండములలో వుండే ప్రకృతి గల దేవమానుషులు మొదలైన దివ్యదేహాలంతా పరతత్వమయిన ఆకాశ మహాభూతము యొక్క ప్రత్యక్ష సృష్టి గనుక ప్రకృతి గలదేహములన్ని పంచభూతాత్మకములుగా వుంచున్నవి గనుక ప్రకృతి