పుట:Kasiyatracharitr020670mbp.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్తాడు. ప్రతిభాతి తక్కువపడే కొద్ది జీవాత్మ అశుద్ధు డవుతూ వస్తాడు. ప్రకృతిలో పరమాత్మ ప్రతిభాతి పరమాత్మ సగృశమై పరమాత్మ తేజోంశము పూర్తిగా సంబంధించే వరకు యీ ప్రకృతి కష్టసుఖములు అనుభవింపుచూ వచ్చుచున్నారు. పైన వ్రాసిన పాంచభౌతిక దేహనివాసి అయిన ప్రకృతిని ఆత్మ అని పెద్దలు అనుచున్నారు; అందులో ప్రతిభాతి అయ్యే పరమాత్మ ప్రతిబింబాన్ని అంతరాత్మ అను చున్నారు. ప్రతిభాతిని కలగచేసే వస్తువు పరమాత్మ అని అంటారు.

ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, అనేవస్తుత్రయము దేవ మాను షాది దివ్య దేహములలో అంతరించి వున్నవి. యీ దేహములలోని ప్రతిభాతులన్ని పరమత్మవల్ల సృష్టి అయిన విన్ని, పరమాత్మ సమములున్ను అయినందున యివి పాంచభౌతిక దేహములు అయినవి. అటువంటి ప్రకృతి దేహములు యీ యెనిమిది వస్తువులతో వుండేవి స్థూల దేహములని పేరువహించి వుంటున్నవి. స్థూల దేహాకృతి పూర్తిగా కిందవ్రాసిన పాణి పాదాదులయిన అవయవాలతో యేర్పడగానే కిందవ్రాసిన జ్ఞానకర్మసాధనములైన యింద్రియాలు జనములై ఆ యింద్రియాలకు పటుత్వము రాగానే వాటి సమూహాన్ని సూక్ష్మదేహ మని అనుచున్నారు. యీ సూక్ష్మ దేహల్ము శబ్ద స్పర్శ రూప రస గంధాలను గ్రహింపుచు జాగ్రదవస్థలో బహు వ్యాపారములు విరామము లేకుండా చెయుచున్నది. అందులో వాక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణా లనే పంచేంద్రియములు బహు వ్యాపారమువల్ల అలియగానే మనస్పనే ఇంద్రియము తమకు యజమానుడు గనుక ఆ మనస్సనే యింద్రియము తాను అలిశే వరకు స్వప్నావస్థ అని వొక అవస్థను కల్పించుకొని ఆ అవస్థలో బహువ్యాపారములను యేకాంతముగా చేయుచూ వుంచున్నది. ఆ మనస్సనే ఇంద్రియానకు అలసట పుట్టగానే అది ఆత్మ అనే జీవునిలో లయించి పోవుచున్నది. అలాగు మన స్సనే యింద్రియము ఆత్మలో లయించి నప్పుడు సుషుప్తి అవస్థ యని అనిపించు కుంచున్నది.