పుట:Kasiyatracharitr020670mbp.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వాసములు కలవారు గనుకనున్ను, కలకత్తా దేశమునుంచి నూరార్లు నావాలు వేసుకొని నా యెదట యిప్పుడు వస్తున్నారు గనుక యెక్కడ రాత్రిళ్ళు దిగినా ఐదారు నావాలు నాతో కూడా దిగుతూ వస్తున్నవి. యీ ప్రాంతములలో రాత్రిళ్ళు వావాలు ఒంటిగా మనిషి కట్టు తక్కువగా దిగి వుంటే దొంగలు తెలివిగా వుండే కిస్తీలు అనే నావాలమీద వచ్చి కొళ్లపెట్టుక పోతారని వాడుకుంటారు. యిప్పట్లో అటువంటి దుర్మార్గములు శానా మట్టుపడ్డట్టు తోచబడుచున్నది.

లోగడ వ్రాశినంతలో శాస్త్రయుక్తిచోదిత మయిన ద్వైతమతము ప్రసిద్ధముగా మధ్వాచార్యులవారు వుద్ధరించి దక్షిణ దేశములొ బహుమందిని తదనుష్టానపరులుగా నున్ను యేర్పరుచుకున్నట్టు యీ దేశములో యెవరినిన్ని లోపరుచు కో లేదని వ్రాసుకుని వుంటిని. గయామహాక్షేత్రము ప్రవేశించిన వెనక గయావళీల మతము విచారించగా వారు మధ్వమత ప్రవిష్టులుగా నున్ను దక్షిణ దేశపు సత్యపూర్ణ పీఠపు శిష్యవర్గముగానున్ను తెలియవచ్చినది.

యీ గయావళీలు మాత్రము యింత దేశములో మధ్వమతానికి లోబడ వలసిన కారణ మేమని విచారించగా వాయుపురాణ ప్రకారము యాగార్ధమై వీరు బ్రహ్మ కల్పిత బ్రాంహ్మణులు గనుక నున్ను ధర్మప్రజా వృధ్యర్ధం వర్ణాంతర స్త్రీలను పరిగ్రహించి నారు గనుకనున్ను యిక్కడి బ్రాంహ్మణ మండలి యీ గయావళీలను తమ సముగాయములో కూర్చుకొక గయాప్రజనకాలములలో మాత్రము వాయుపురాణ ప్రకారము వీరిని తగురీతిని ఆరాధనచేయుచు నుండగా మధ్వమత ప్రకటనార్ధము యేనూరేండ్లకిందట మధ్వమతొద్ధారకులు యీ దేశమునకు వచ్చినప్పుడు అందరికి యిక్కడా వెలిగావున్న గయావళెలు అందరున్ను యిక్కడ అనంగీరారము చేశిన మతాన్ని అంగీకరించి తమంతట తాము యిక్కడ వొక ప్రత్యేక మతానుసారులుగా వుండడము యుక్తమని నిశ్చయము చేశి మధ్వమత సంకేతాలకు అన్నివిధాలా అప్పుడు లోపడినారు. మతోద్ధారకులు ద్రావిడాచారాలు యావత్తు వీరికి బోధచేసి తదారభ్య ద్రావిడాన్నము భోజనము చేసేటట్టు వీరికి యిచ్చను కలగచేసినారు. ఆ