పుట:Kasiyatracharitr020670mbp.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీగయావళీలేమి, యీదేశపు పంచగౌడ బ్రాహ్మణులేమి వారి వటువులకు యెనిమిదో సంవత్సరమున వుపనయనము క్రమముగా చెస్తారుగాని ఆచిన్న వాండ్లచేత అటుతర్వాత త్రికాలములను సంధ్యవార్పింఛే జాగ్రత చెయ్యడములేదు. వివాహాదులు నాలుగు దినముల దీక్షతో చేస్తారు. నిశ్చితార్ధము మాత్రము కొన్ని నెలలకు ముందే చేసివుంచుతారు. ప్రవేశ హోమము శేషహొమము పాణిగ్రహణము యీ ముఖ్య కృత్యములు కద్దు. మంగల్య ధారణము మొదలయిన లౌకిక లాంచనలు దక్షిణదేశము వలెనే నడవడము లేదు. జాతా శౌచాదులు శృతి స్మృతి ప్రకారము ఆవరించుతారు. గంగకు సమీపప్ర్రాంతములందు వశించేవారు, యెవరు దేహము వదలినా దేహమును యథోచితముగా కర్మ నిమిత్తము తప్తముచేసి గంగలో విడిచిపెట్టుతారు. కర్మ ప్రసక్తి లేనివారి దేహములు వొక నిమిత్తము లేక గంగలో విడిచి పెట్టడమే ముఖ్యముగా జరుగుచున్నది.

యిక్కడి పంచాంగాలలొ గ్రహ దృష్టులు సాధించి వ్రాయుచున్నారు. తిధివార నక్షత్ర యోగకరణాదులు దక్షిణదేశపు పంచాంగానికి గడియ యెచ్చు తక్కువగా సరిగా వుంచున్నది. పంచాంగాలలో వివాహోపనయన ముహుర్త విచారణ బహుశ: లోకులు చేయుచున్నారు. శివాలిఖిత మని వొక ప్రయాణ ముహూర్త నిర్ణయ గ్రంధమున్నది. దాని ప్రమేయము సాంబమూర్తి త్రిపుర పరిహారము చేయబోవు నప్పుడు తలచిన కాలమందు ముహూర్తము దొరికేటట్టు ఆ గ్రంధము లోకోపకారముగా చేసినాడట. జాతక సంవత్సర ఫలాలు గొప్ప వారికి జ్యోతిషికులు వ్రాయిస్తూ వస్తారు.

కాశీప్రయాగలొ దక్షినదేశస్థులేమి, యిక్కడి ఉత్తర పశ్చిమ తూర్పు దేశస్థులేమి అనేక ధర్మాదులను కాశీతంబురాయడి అధీనముగా దక్షిణదేశస్థులు కాశీ మొదలయిన ధర్మాదులను చేసినట్టు చేసి అనేక గుమాస్తాలగుండా నడిపిస్తూ వుండేది. నడుస్తున్నదా లేదా అని సర్కారుతరపున విచారణలేదు.

దక్షిణదేశపు సౌరమాన చాంద్రమాన నక్షత్రమానాలకున్ను,