పుట:Kasiyatracharitr020670mbp.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిచ్చమాత్రము యిప్పుడు నిలిచి వున్నది గాని, వారు బోధ చెసిన ఆచార వ్యవహారాదులు యీ దేశాస్థుల సాంగత్యము చేత క్రమక్రమశ: ఖిలపడుతూ వచ్చినది.

వాయుపురాణ ప్రకారము గయావళీలను గయావ్రజనక్రియలు చేయడములో ఆరాధన చెయవలసినది అగత్యము గనుకనున్ను, ద్రావిడాచార ప్రకారము పిండప్రదానాత్పూర్వము అన్నశ్రాద్ధము చేయడము ముఖ్యము గనుకనున్ను, గయవళీలు ద్రావిళ్ళు పచనము చేసిన అన్నము భోజనము చేసేటట్టు సమ్మతించినారు గనుకనున్ను, చటకము మొదలైన శ్రాద్ధాలు చేసి గయావళీలకు ఆమం మొదలైన భక్ష్యయోగ్య వస్తువులు యిచ్చే టంతకన్నా అన్నశ్రాధ్హానికి గయావళీలను బ్రాహ్మణార్ధము చెప్పేటట్టు దక్షణ దేశస్థులు నిశ్చయము చేసినారు గాని యేకారణము చేతనున్ను గయావళీలు పక్వము చేసిన అన్నమును ద్రావిళ్ళు వుచ్చుకునేటట్టు సమ్మతించినవారు కారు. తదారభ్యగయావళీలు ద్రావిళ్ళవల్ల యీపాటి జరిగే గౌరవమును కాపాడుకోవలసి ద్రావిడ దేశస్థులు భోజనము చయ్యకనుండేవారి చేతి పక్వాన్నము తామున్ను భుజించకుండా ద్రావైడాచార ప్రకారము నడిచేవారమని అభినయిస్తూ కాలము గడుపుతూ వస్తున్నారు. యాభై అరవై యేండ్ల క్రిందట సత్యూపూర్ణ పీఠస్థులు యీ ప్రాంతముల చచ్చివుండి గయావళీలకు నమాశ్రయణము చేసి పూజగైకొని పోయినారు. యిప్పుడున్ను పునా శ్రీమంతుడు మొదలయిన గొప్పవారి గయావళీలు మాత్రము యధోచితముగా యజమాన ప్రీత్యర్ధమై బ్ర్రాహ్మణ నిత్యకర్మలు జరుపుకుంటారు.

పద్దెనిమిదవ ప్రకరణము

మనలో పేరుగలిగిన యాభై ఆరు చేశాలు వాటి ఛెప్పన్నభాషలున్ను యీ బ్రహ్మాండములో యేపక్క వున్న వని విచారించగా నేను చేసిన దేశాటనముచేత నాకు కలిగివుండే స్వానుభవము చెతనున్ను, నా వినికిడి వల్లనున్ను, నేను నిశ్చయము చేసినది యేమంటే ఆ దేశాలంతా కర్మద్వారా బ్రహ్మానుసంధానము చేసే 'యిండి