పుట:Kasiyatracharitr020670mbp.pdf/299

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యా' అని నామధేయము కలిగిన కన్యాకుమారి మొదలు కాశ్మీరము లోపలనే వున్నవి గాని అన్యత్ర కాదు, అని నిశ్చయము చేసినాను. అయితే బహు దినములుగా యీ భూమి తురకలచేత ఆక్రమింపబడి దేశ సరిహద్దులు తెలియకుండా భూమిని కలిపి వారి యేలుతూ వచ్చి నందుచేత యిప్పట్లో ఆ యాభ్హై ఆరు దేశాల సరిహద్దులు అన్ని కనిపెట్టి వ్రాడనకు ప్రయాసగా నున్నది. అయినా ఆ యాభై ఆరింటిలో అనేక దేశాల సరిహర్రులు కనిపెట్టి వ్రాయవచ్చును.

మనము వసించే భూమితోకూడా ఊర్ధ్వ లోకాలు యేడు; అధోలూకాలు యేడు. వాటిస్థితి యెక్కడ నని విచారించగా నాబుద్ధికి తేటపడ్డది యేమంటే, పయిన వ్రాశిన పదునాలుగు భువనములు యీ బ్రహ్మాండమునకు అంతర్భూతములని నిశ్చయపడ్డది. అది యెట్లంటే యీ బ్రహ్మాండము కోడిగుడ్డు ఆకారముగా వున్నదని మన శాస్త్రమున్ను మతారంతరస్థుల భూగోళ శాస్త్రములున్ను యేక వాక్యవ పడి వున్నవి. మన గణిత శాస్త్ర ప్రకారముగా నున్ను యీ బ్రహ్మాండానికి 120 భాగాలుగా చేసి అందులో మధ్య ప్రదేశాన్ని మనవారు నిరక్ష దేశమనిన్ని, జాతులవాండ్లు 'లయన్ ' అనిన్ని పేరుపెట్టి వున్నారు. గనుక ఆ నిరక్ష దేశానకు వుత్తరము యేడులొకములుగానున్ను, దక్షిణము అధోభాగమునందు యేడు లోకాలుగా నున్ను మన వారు నియమించినారు. వుత్తరము వూర్ధ్వభాగమందు వుండే యేడు భువనములలో మానుష నివాస భువనము వొకటి. దీనికి పై అంతస్థు అంతస్థుగా మనుష్యాపేక్షయా దేవతాస్వరూపులుగా వుండేవారు సృష్టికోటి తారతమ్యాల ప్రకారము శుద్ధసత్విక గుణప్రధానులై శీతల భూప్రదేశాలలో ఆనందింపుచు నుండే లాగు తోచుదున్నది. యీ లోకము లను స్వర్గ మర్వ్య పాతాళలోము అని మూడుగా చెప్పుచున్నారు. నిరక్ష దేశమునకు దక్షిణమందు అధోభాగమున తమోగుణ ప్రధానులైన రాక్షస భూతప్రేత పిశాచూదులు వారి వారి తారత్మ్య ప్రకారము అంతస్థులుగా వసింపుచునుండేలాగు తోచబడు చున్నది.

మనుష్యనివాసభూమికి ఊర్ధ్వాధ: ప్రదేశములలో వసింపచే