పుట:Kasiyatracharitr020670mbp.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేడుకగా వుంచున్నది. మధ్యే ఒక్కొక్క యెర్రవర్ణపు పూలున్ను సకృత్తుగా పూచియుంచున్నవి.

గోధుమలు, జవ అనే యవలున్ను వరిపయిరు వలెనే పెరిగి తోకవడ్లవలెనే యెన్నులు తీయుచున్నవి. గోధుమ యెన్నులు కురచగా నున్ను, గింజలు గుండు అందముగానున్ను జడ అల్లినట్టుగా వుంచున్నవి. యవయెన్నులు తోకవడ్ల యెన్నులకు అన్ని విధాలా సరిపోలి వుంటున్నవి. యీదేశపు గౌడ బ్రాహ్మలందరున్ను అభిని మందు, బంగాకు దాని జడలున్ను సహజముగా అంగీకరిస్తారు.

యీ గయా మహాక్షేతములో కాశివలెనే అడుగడుగుకు లింగాలు లేకపోయినా శానా గుళ్ళు తీర్ధాలకు నాలుగు పక్కలా వున్నవి. అందులో ముఖ్యముగా మంగళగౌరి యని వొక శక్తి గుడిన్ని గయాసురి అనే శక్తి గుడిన్ని వున్నవి. యీ రెండు గుళ్ళలో తామసారాధన లయిన బలిప్రదానాలు జరుగుచున్నవి. యీ మంగళ గౌరి యనే దేవిగుడి అష్టాదశ పీఠాలలో ఒకటి యని వాడుకుంటారు. యీ గయా మహాక్షేత్రములో ఫిబ్రవరి నెల 14 తేదివరకు వాసము చేసినాను.

పదియేడవ ప్రకరణము

ఫిబ్రవరి నెలె 14 ది మధ్యాహ్నము 12 ఘంటలకు ఆ క్షేత్రము వదిలి ప్రయాణమై లోగడి దారిగానె మళ్ళీ 12 తేది పట్నాషహరు ప్రవేశించినాను. నేను మైహరు అనే వూరు వదిలిన వెనక యీ నెల14 తేదివరకు యెక్కడా వొక చినుకయినా పడ్డది కారు. శివరాత్రి ముందు వెనకలుగా యీ దేశములో వర్షము కురియడము వాడికె గనుక సివరాత్రి ముందు వెనకలుగా యిక్కడ మంచివర్షాలు కురిశినవి. యీకాలమందు కురిశే వర్షము కూడా ఘనీభవించి రాళ్ళ వాన కురియడము కద్దట. ఆదేప్రకారము యీ చుట్టుపక్కలా తూర్పు గాలి సహితముగా రాళ్ళవాన కురిశినట్టు విన్నాను. ఆ రాళ్ళు భూపతన మయిన రెండు గడియలకు కరిగి పోవుచున్నవట. యీ వానలు