పుట:Kasiyatracharitr020670mbp.pdf/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పంటలలో అభినిమందు గోధుమలు యవలు యివి నిండా వెలగల వస్తువులు.

అభిని మందు గసగసా కాయలమీది బంక. ఆ కాయలను పోస్తుకాయ అంటారు. యీవస్తువులు ఫలింఛే కాలము యిదే గనుక గయ చుట్టూవున్న పట్నా నుంచి గయకు వచ్చే దారిలో నున్ను పైన వ్రాసిన వస్తువులు అమితముగా ఫలించియున్నవి. పోస్తుచెట్లు వూళ్ళవద్ద వేస్తారు గాని యిండ్లకు దూరమైన పొలములో వేయరు. పోస్తుచెట్లు అరిటిచేట్ల రీతుగా మొద్దుకట్టి వుండును. ఆ యేన్ను మొద్దుకు నాలుగు పక్కలా ముల్లంగి ఆకులవలెనే దళసరిగా ఆకులు వేసుకుని వచ్చి ముల్లంగి చెట్టంత పొడుగు కాగానే కాడవంటి యెన్ను తీసి యెన్నుకొనను తెల్లని పుష్పములు పుష్పించి రేకులు రాలిన వెనక పత్తికాయలవంటి పిందె బుట్టుచున్నది. అరటి పువ్వందముగా వెలపటి కాయ రవంత పెద్ద పెరగగానే కాయ వూర్ధ్వముఖ మవుచున్నది. ఆ కాయ నిమ్మకాయ కన్నా యెక్కువ గాత్రమయ్యేది. ముక్కాలు వాసి కాయ కాగానే మూడు సూదులు ఒక కట్టగా కట్టుకుని నాలుగు ఆవృత్తులుగా కాయకు నాలుగు పక్కలా మూడేసి గీట్లుగా గీస్తారు. గీచిన మురసటిదినము ఆ గీతలమీద మునగబంక వర్ణముగా మెత్తని బంక పుట్టు చున్నది. వాటిని కత్తులతో గీచి కుంఫిణీవారికి శేరు 1 కి రూపాయలు 4 వంతున యిస్తారు. మరి ఒకరికి రహితులు అభినిమందు యియ్యకూడరు.

ఈ మందు యీ హిందూస్తాన్ లో అయ్యేదంతా శేఖరం చేసే కొరకు పట్నాలో సర్ చర్లీస్ చార్లీన్ డాలిబ్యార్డు అనే గొప్ప దొరను వుంచివున్నారు. నభినిమందు విషయాన్ని గురించి అతను మేమి వ్రాసినా కలకటరు మొదలయిన అధికారస్థులు శిరసావహించి నడవవలసినది. ఆ దొర ములుకుగిరి తిరుగుతూ వుంటాడు: ఆ పోస్తుకాయలు చేతికి మెత్తగా వుంచున్నవి. కోస్తేలొపల కిత్తిలిపండువలె తొలలుగా చీల పోతున్నవి. ప్రతి తొలమీదా గసగసలు ఈశ్వరుడు కూరిపోసివున్నాడు. పోస్తు కాయలు పొలము చూచి నప్పుడు గోడుగులవంటి శుద్ధధావళ్యముగల పూలతో బహుశృంగారముగా చూడ