పుట:Kasiyatracharitr020670mbp.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మశాలలు కట్టివున్నవి. స్థలంతరము దొరకనివారు యీ ధర్మశాలలో శ్రాద్ధాలు ఛేయుచున్నారు. యీ దినము యెక్కడ శ్రాద్ధము పెట్టినా పిండాలు తెచ్చి విష్ణుపాదముమీద వేయవలసినది.

10 దో దినమున, గయా ప్రజనానికి పూర్తిగా నటశ్రాద్ధము చేయవలసినది గనుక అక్షయ వటము కట్టివుండే ధర్మశాలలకు శ్రాద్ధయోగ్యమయినపదార్ధాలు అన్ని యెత్తుకొని వెళ్ళి ఆధర్మశాలలో పాకముచేసి శ్రాద్ధముచేయవలసినది. ఫల్గుని, విష్ణుపది, అక్షయవట శ్రాద్ధాలకు గయావళీలే బ్రాహ్మణార్ధాలు చేయవలసినది. గనుక వారు భోజనానికి రావడానకు శానా సావకాశ మవుతున్నది. వారిలో బహుమంది వుదయాన ఫలహారముచేసి వస్తారు. బ్రాహ్మణార్ధము చేస్తే రెండోసారి భోజనము చేయరాదనే నియమము వారికి లేదు. బ్రాహ్మణార్ధానికి పూర్వము సహజముగా తాంబూల చర్వణము చేయచూ వుంటారు. బ్రాహ్మణార్ధానికి వచ్చేటప్పుడు యింట్లోనే స్నానము చేసి సవారియెక్కి వచ్చి యిక్కడ వస్త్రపరివర్తనము చేసుకొని బ్రాహ్మణార్ధానకు కూర్చుంటున్నారు. హిందూస్తానులో వసించే పంచద్రావిళ్ళూ మొదలైన బ్రాహ్మలందరు స్త్రీలుసహా బోజన కాల మందు పట్టువస్త్రాలు, నారపట్టులు, ధావళ్ళు కట్టుకొని వుండడము గాని నూలుబట్టలు కట్తుకొన్నవారు పంక్తికి వచ్చింప్పటికి అశుచిగా యెంచుతున్నారు గనుక యీ గయావళీలకు అదే ఆచారము.

అక్షయవటము చుట్టు గోడపెట్టి వాకిలి పెట్టియున్నది. ప్రేతపర్వతము రామపర్వతము తప్ప కడమ పిండప్రదానాలు చేసే స్థలముల కంతా కావలసిన వారిని కూడా పిల్చుకుని పోవచ్చును. యెవరు కావలసినా ఆయా స్థలముల దర్శనము నిమిత్తము యెప్పుడు కావలిస్తే అప్పుడు పోతూ వస్తూ వుండవచ్చును. గయా వ్రజనాలు చేసి పిండప్రదానాలు ఆ యాస్థలములలో చేశేవారు సరకారులో నుంచి యిచ్చే చీట్లను అక్కడక్కడ వుండే చౌకీ బంట్రోతులకు చూపించి వారికి చీటీ 1 కి వొకపైసా వంతున యిస్తూ రావలసినది. యీఅక్షయవటము అనేకావృత్తులు సమూలముగా యెండిపోయి వేరే వృక్షౌలు కూడా బదులుకు సమీపముగా వుంచి సిద్ధము చేసినవనక హాశ్చర్య కరముగా