పుట:Kasiyatracharitr020670mbp.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండే ఒక మంటపములో వేశి అక్కడ వుండే చూతవృక్షదర్శనము చేసి పూజచేసి రావలసినది.

యెనిమిదో దినమున విష్ణు పాదానికి సమీపముగా వుండే అష్టాదశ పాదాలమీద 12 మాట్లు ప్రత్యేక ప్రత్యేకముగా పిండదానాలు ఒక మంటపములోనే ప్రత్యేక ప్రదేశాలలో చేశి ప్రతి పాదము వద్దనున్ను నదదీప మనే ఘృతదీపాలువుంచి క్షెరతప్రణము ప్రతిపాదము మీద పితృద్దేశముగా చేయ వలసినది. యీ కృత్యము కావడానకు యీదినము అస్తమాన మవుతున్నది. ఈ స్థలాలయందు పిండ ప్రదానాలు చెశేటప్పుడు యేదేవతాత్మకముగా ఆస్థళము వుంటే ఆలోకములో అన్శత్పతృ నివాస సిధ్యర్ధం అని సంకల్పము చేయుచూ రావలసినది.

తొమ్మిదో దినమున ఫల్ఘునీశ్రాద్ధమువలేనే క్రమముగా అన్నశ్రాద్ధము విష్ణుపాద ప్రయుక్తముగా చేసి శ్రాద్ధానంతరము విష్ణుపాదము మీద పిండప్రదానము చేయవలసినది. విష్ణుపాదము మీద అశక్యముగా లోకులు పిండాలు వేస్తూ వుంటారు గనుక పిండముమీద పిండము పడకుండా రాజాధిరాజులుగ వుండే వారు సరకారుహుకుము మీద తాము పిండప్రదానము చేశి బయిట వచ్చేకొరకు యెవరినిన్ని గర్భగృహములోకి రానివ్వకుండా సరకారు మనుష్యులను వుంచి నిరోధము చేస్తారు. యిటువంటి లౌకీకప్రతిష్ట అయిన పనులు యిక్కడి జడ్జీగా వుండే మారీసు దొరగారికి, కలకత్తాలో వున్న నావిహితుడయిన మేస్తర్ మించ్చన్ దొరగారు ఒక కాకితము పంపించినంతలోనాయెడల మిక్కిలి కటాక్షము వుంచి యిక్కడవుండే సకల అధిరారము గల యింగిలీషు దొరలతో నాకు విహితము చేసి వారిగుండా కావలసిన సహాయము నాకు కరతలామలకము అయ్యేటట్టు చేసినాడు గనుక యీశ్వర కటాక్షముచేత నాకు కావలసినంతకన్నా యెక్కువ లౌకీక ప్రతిష్ట యిక్కడ సిద్ధించినది.

విష్ణుపాదముమీద పిండప్రదానము కాగానే గయావళీకి ముఖ్యముగా గోదానము చేయవలశినది. యీ విష్ణుపాదపు గుడివద్ద కొన్ని