పుట:Kasiyatracharitr020670mbp.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి

యిట్లా వుండగా సూర్యభగవానుడు చాయాదేవికి గర్భోత్పత్తి అయ్యేటట్టు చేసెను. తదనంతరము ఆమె తపస్సు చేస్తూ వుండెను. మళ్ళీసూర్యుడు ఆమెతోసంగమము యిచ్చయించి నంతలో ఆమెగర్భావస్థలో సంగమము విధివ్యతిరిక్తమని సమీపానికి రాక పోయినది. సూర్యుడు మోహావేశ యుక్తుడయి చాయాదేవి సమీపానికి పచ్చినాడు గనుక వెంబడిగానే అతని తేజోవేగానికి ఆమగర్భమునిలవలేక విచ్చిత్తి అయిపోయినది. ఆ చొప్పున విచ్చిత్తి అయిన గర్భము కొంతమట్తుకు ఒక పిండాకృతిగా నున్ను కొంత వుదకముగా నున్ను స్రవించి నందున చాయాదేవి సహితముగా సూర్యుడు విస్మయాన్ని పొందినాడు. వెంబడిగానే హరిరుద్రాదులు ప్రసన్నులయి రుద్రుడు తన శక్తిని ఆ పిండములొ ఆవాహనచేసి యమధర్మరాజు అనే ఒక పురుషుణ్ణి ఆ పిండముద్వారా వుత్పత్తిచేసి అతణ్ణీ భూమిలో దక్షిణభాగమందు వుండేటట్టు నీమించి పాపులను విచారించి శిక్షింఛేటట్టు నీమించినాడు. విష్ణువు తత్ప్రతిగా స్రవించిన వుదకములో తన శక్తిని ఆవహింపచేసి యమునా అనే స్త్రీ నదీస్వరూపముతొ యీ పుణ్యక్షేత్రానికి ప్రవహించి వచ్చినది. యిక్కడ విరాజమాన్యుడుగా వుండే మాధమూర్తి ఆ స్త్రీ సౌందర్యము చూచి మోహితుడై భార్యలా వరించినాడు.

యిట్లుండగా రామాయణములో వివరించిన హేతువులచేత భగీరధుడు గంగను కూడా భూలోకమునకు తీసుకొని వస్తూవుండగా గంగ యీ క్షేత్రములో ప్రవేశించగానే యమునకు సమాచారము తెలిసి యెదురుకొని పోయి ఆరాధించి తనతో కూడా కలిసి ప్రవహించాలనని ప్ర్రార్ధించినది. అందుకు గంగ చెప్పిన దేమంటే నీవు మహా ప్రసిద్ధురాలయితివే. నేతోకలిస్తే నా పేరే లెకపోనేమో అని సందేహించి నంతలో యమునానరి గంగా సహవాసాపేక్షితురాలై యీ క్షేత్రము మొదలుగా నీవు నాతో కలిసి ప్రవహిస్తే పేరు నీదేను. నాప్రవాహ స్వరూపముమాత్రము వేరుగా వుండతగ్గదని