పుట:Kasiyatracharitr020670mbp.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

వరమిచ్చినందున గంగ యమునతో యిక్కడ సంగమమైనది. యీస్థలము యాగాలుచేయు నిచ్చయించిన బ్రహ్మదేవుడు మొదలుగాగల పెద్దలను ఆకర్షింపుచు వచ్చినందున ప్రయాగ అనె పేరు యీస్థలానికి కలిగినది. యీ ప్రయాగక్షేత్రములో గంగ యమునతో సంగమ మయినది మొదలుగా సాగరసంగమ పర్యంతము రెండునదులు సమష్టి జలము ఒకపక్క యమునా సంబంఢమైన నైల్యవర్ణము కలిగి గంగా అనే పేరుతో ప్రవహిస్తూ వున్నది.

యిట్లుండగా బ్రహ్మ అశ్వమేధాలు చేసిన వెనక యీస్థలాన్ని స్తుతి చేయును మొదలుపెట్టి సమాప్తి చేయడానకు శక్తుడుగాకపోయెను. బ్రహ్మపుత్రి అయిన సరస్వతి నేను సమాప్తి చేయగలను గాని నీచేత వచ్చునా యని స్తుతిచేయను ఉపక్రమించి ఉపసంహారము చేయునుశక్తురాలు కాకుండా పోయి లజ్జతురాలయి వుండెను. యిట్లుండగా బడబుడు అనే ఒక రాక్షసుడు భూలోకమందు పుట్టి అతి క్షుత్తుచేత లోకాన్ని హింసిస్తూ వచ్చినందున త్రిమూర్తులు లోకరక్షణార్ద మయి ఒకటిగా కూడి యోచనచేస్తు వున్నంతలో లజ్జితురాలయిన సరస్వతి యేసాకుచేత నయినా బ్రహ్మముఖము చూడక తప్పించుకొని పోవలెననే యిచ్చచేత నేను ఆరాక్షసుని ఉపద్రవము జగత్తునకు లేక చేస్తున్నానని ప్రతిజ్ఞచేసి బ్రహ్మలోకము వదిలి వారి అనుజ్ఞమీద భూలోకానికి వచ్చి అతి సుందర రూపములో వీణాగానము చేస్తూ ఆ రాక్షసుని సన్నిధానానకు వచ్చినది. ఆ రాక్షసుడు ఆమె సుందరాకృతికి మోహితుడయి క్షుద్బాధనుకూడా సహించి కొంతసేపు లోకాన్ని ఉపద్రవవ పెట్టనివాడయి సరస్వతిని చూచి నిన్ను వివాహము చేసుకోవలనని మనసు వున్నదని చెప్పినాడు. ఇంత క్షుత్తుగల నిన్ను పెండ్లి ఆడితే భోగాలకు సావకాశము వుండనేరదే! ఒకవేళ నీవు నన్ను భక్షించివేతువనే భయము నాకు జనింపుచున్నది గనుక క్షుత్తు నివర్తింఛే పని ముందర విచారిస్తే వెనక వివాహసంగతి మాట్లాడుకొందామని సరస్వతి చెప్పెను. నాక్షుత్తు నివృత్తి అయ్యేమార్గము నీవే విచారించవలనని ఆ రాక్షసుడు సరస్వతిని ప్రార్ధించి నందున సరస్వతి బడబాసురుని మంచిదని వెంట