పుట:Kasiyatracharitr020670mbp.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏల్నుగుల వీరాస్వామయ్య గారి

జ్వరాలు తగిలినందున పదిహేనుమందికి నేను యిచ్చిన వాంతిభేది వాంతిమందులతో నున్ను బ్యారుకుపొడి లింగకట్టు మాత్రలతోనున్ను వాశి అయినది. చెన్నపట్టణమునుంచి కూడా వచ్చిన యొక కావటివాడు మాత్రము గంగతీరమందు దేహము చాలించినాడు. ఇంతకు లోగడ హైదరాబాదు దాటిన వెనక ఒక బంట్రౌతు వాంతి భేదుల ఉపద్రవము అకస్మాత్తుగా తగిలి నావద్ద ఔషధాలు సేవించను అవకాశము చిక్కక చనిపోయినాడు. ఇప్పటికి నలుగురికి మాత్రము తేలికెగా చలిజ్వరములు తగులుచుండుటచేత వారినికూడా నడిపించుకొని 9 వ తేది ఉదయమైన 8 ఘంటలకు బయలువెళ్ళీ యిక్కడికి అధికారస్థులయిన గురుదాసుబాబు వగయిగాలతో కూడా యిక్కడికి 2 కోసుల దూరములో వుండే వింధ్యవాసిని అనే దేవిక్షేత్రము 10 ఘంటలకు చేరినాను.

మిరిజాపూరువూరి తోటలు మొదలయినవి దాటి వెలిపడాగానే గంగలోకలిసే నొక వాగు దాటవలసినది. ఆ వాగునీళ్ళు తీసి పోయునా రొంపివిస్తారము గనుక మోకాలుదాకా దిగబడుచు వుంటున్నది. అందువల్ల గంగలోనే పడయెక్కి ఆ వాగు అవతలిగట్తుట్టు చేరవలసినది. దారి సడక్కు లేకపోయినా నడవడానికి తోటలపెరండ్ల మధ్య నున్నది గనుక వైపుగావున్నది. రేగడభూమి.

వింధ్యవాసిని వూరు గొప్పదే. అయితే వీధులు బహు కుసంది మిట్టలు పల్లాలుగా వుంటున్నవి. యీ దేవిని పూజచేశేవారు పండ్యావాండ్లనే బ్ర్రహ్మణులు. ఇక్కడికి బ్రాహ్మణులు పంచగౌడులతో చేరినవారు. కన్యాకుబ్జు లనిన్ని, సర్వర్యులనిన్ని, గౌడులనిన్ని, సారస్వతులనిన్ని, మైధిలులన్ని, అయిదు తతెగలుగా నున్నారు. అందులో యీ పండ్యాలకు కన్యాకుబ్జులని పేరు. వీరే కనోజా లనబడుదురు. మన దేశములోను బ్రాహ్మణులు పంచ ద్రావిళ్ళ వయన మేమంటే ఆంధ్రులు, ద్ర్రావిళ్ళు, మహారాష్ట్రులు, కర్నాటకులు, ఘూర్జరులున్నని తెలిసేది. వీరి దేశవిభాగాలు తెలిసియున్నవిగదా, యీ అయిదు తెగల