పుట:Kasiyatracharitr020670mbp.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

వారికి ఆచారవ్యవహారాలు భేదించి వుండేటట్టుగా యీ దేశపు పంచగౌడులకున్ను బేదించియున్నది.

యీ పండ్యాలలో యెవడు ముందర యాత్రవారిని కనుక్కుంటే వారికి యీ దేవీస్థలములో ముఖ్యాశ్రితులయి యాత్రవారు దేవీ విషయముగా యిచ్చే వస్త్రాభరణ దక్షిణలు మొదలయినవి యావత్తున్ను తీసుకొని అనుభవిస్తారు. గనుక నేను మిరిజాపురము చేరగానే నన్ను అనుసరించ వచ్చిన పండ్యాలను లెక్కపెట్టను శక్తి లేదనుకోవలసినిది. గురు దాసు బాబు పండ్యాను నేను నిష్కర్ష చేసుకొని యీ స్థలములోనుండే రామనగరపు రాజు వుదయ నారాయణన్ తోట బంగాళాలో దిగినాను. యీతొట సకల ఫల వృక్షాలతో శాలలు తీర్చబడి బహు సుందరముగా గంగాతీరమందున్నది. అందులో గంగవొడ్డుగా రమణీయమైన బంగాళా కట్టియున్నది. వంటకున్ను పరిజనానికిన్ని చుట్టూ ఆవరణాలు యేర్పరచియున్నవి.

యీ మహాస్థలములొ రెండు తామస మహోత్సవాలు చైత్రశుద్ధములోను, ఆశ్వీజ శుద్ధములోనున్ను, జరిగి అందుకు లక్షోపలక్ష ప్రజలు వస్తున్నారు. దేవి ప్రీతిగా బలియిచ్చే సన్నజీవాలు లెక్కపెట్టను ఒకరికిన్ని తరము కాదు కనుక ఆపది దినములలో సంహారమయ్యే జీవాలంతా ఒక మిరాశి దారుని చేతిగుండా సమాప్తి కావలసినది గనుక వానికి అజము 1 కి వచ్చే ఒక పయిసా రుసుము ప్రకారము దినానికి, 25-30 ఫరకుబాదు రూపాయిలు వస్తూ వుంటున్నవి. అనేకులు యీ స్థలములో పునశ్చరణచేసి యిష్ట సిద్దిని పొందినారు.

యీ స్థలములో మూడు శక్తులు వసిస్తున్నవి. వాటికి యోగమాయా, భోగమాయా, కాళీ, అనే పేళ్ళు కలిగియున్నవి. యీభోగమాయ ప్రతిదినము అయ్యే పూజా నైవేధ్యాలను మిక్కటముగా వూరికి సమీపమున వుండుకొని ప్రతిరహింపు చున్నది. అక్కడికి రెండుకోసుల దూరములో పర్వతముమీద యోగమాయా అనిన్ని, అష్టభుజీ అనిన్ని పేరుగలిగిన శక్తి వసించి యున్నది. అక్కడికి సమీపముగానే ఒక పక్క కాళి అనే శక్తి వసించి యున్నది. యీ బలిప్రదా