పుట:Kasiyatracharitr020670mbp.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి

తెప్పించినాను. ఈయూరు జలవసతి యయినది కారు. తమలపాకులు ఈ యూళ్ళో దొరకడము కష్టము.

శ్రీరామ కటాక్షమని అప్పుడప్పుడు నేను వ్రాయడములో పరబ్రంహ్మ యొకవస్తువే జగత్కారణమై యుండగా ఒకరొకరు ఒక్కొక్క అవరారముర్తి నామమును నావలేనే ఆశ్వయించి ఆరాధన చేయడమేమని శంక తొచును. అందుకు సమాధాన మేమంటే - పరబ్రంహ్మ సర్వాంతర్యామిగానున్నా చందన కాష్టములో ప్రవేశించిన అగ్ని పరిమళించినట్తు సృష్టిస్థితి సంహారాలకు కారణమయిన త్రిమూర్తులలో ప్రతిఫలింఛే పరమాత్ముదేమె లోకశిక్షార్ధమై అనేకావృత్తులు అవతరించిన సత్వగుణ ప్రధానుడయిన శ్రీమన్నారాయణ మూర్తిలో ప్రతిఫలింఛే పరమాత్ముడేమి, అస్మదాదులలో ప్రతిఫలింఛే పరమాత్ముడేమి, అంతా ఒక్క వస్తువయినా ప్రతిభాతిని ఇచ్చే వస్తువిశేషాలచేత ఒక ప్రకృతికి మరియొక ప్రకృతి పూజ్యమయినది. ఆ న్యాయప్రకారమే రామకృష్ణాద్యవతారాలు అస్మదాదులకంటె అతిపూజ్యము లయినవి గనుకనున్ను నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూప మయిన పరబ్రహ్మము పూర్వన్యాయాలచేత బాధకమున్ను సాధకమున్ను వొక్కటే అయినందున రూపాంతర, నామాంతరాలను బట్టి ఆరాధన చేసుటఛేత బాధకను లేక సాధకముగానే యుండవచ్చును గనుకనున్ను ఈశ్వరలీలావతారకధలు శ్రవణము చేసుటలో ఏలీలచేత భక్తులను మిక్కుటముగా పరమాత్ముడు హర్షించి, పోషించి నాడని వారివారికి తోచబడుచున్నదో ఆయా యవతారనామమే మిక్కిలి ముఖ్యమని యెంచి దాన్ని వారు వారు వృద్దాచార ప్రకారము ఆశ్రయించి భక్తిపూర్వకముగా ఆరాధింపుచున్నారు. తామసగుణప్రధానుడయి త్రిమూర్తులలో ఒక్కడు న్నయిన సాంబమూర్తికి తమోగుణముచేత సంహారము చేయుచు రావలసినపని యొకటే మాయాయుక్త మయిన పరబ్రహ్మ వల్ల నియమింప బడ్డందున సంహారము చేయడానికి తా నున్న రీతి