పుట:Kasiyatracharitr020670mbp.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

యెక్కి దిగవలెను. ఇవతల గణేశగంజు చేరేవరకు ఇరుప్రక్కల పర్వతములు కలిగి వున్నది. భాట రాతిగొట్టు; ఈవూరిలో కొట్టాయీలు యధోచితమయిన వసతిగా కట్టియున్నారు. కావలసిన సామానులు దొరుకును. ఈ యూరికి సమీపముగా ఒక నిర్మలమయిన జలముగల వాగు పారుచున్నది. ఇటువంటి వాగులు కొన్ని దారిళొ దాటవలసి యున్నవి. ఆ రాత్రి అక్కడ వసించినాను.

3 తేది 7 ఘంటలకు బయలు దేరి యిక్కడికి 20 కోసుల దూరములోనుండే ధూమా అనే వూరు 3 ఘంటలకు ప్రవేశించినాను. నడిమి వూళ్ళూ నెంబరు -6 - లక్కనోడాన్ -1- మకరాచౌకీ -1- నెడునది-1- జూబా-1- ఘాఘురీ-1- ధూమా-1-.

దాదిలో లక్కునోడాన్ అనే ఊరు ఉన్నది. అదివరకు కొండల మధ్యే మిట్టయెక్కుచు, పల్లానదిగుచు దారినడవనలెను. భాట నల్ల రేగడ, రాతిగొట్టు. చిన్నవాగులు అనేకములు దాటవలెను. జూబానది అనే ఒక పెద్దవాగు దాటవలెను. గణేశగంజువద్ద నుండే వాగున్ను పెద్దదేను. అదిదాటి కొండవంటి మిట్టయెక్కవలసినది. లక్కునోడాన్ మొదలుగా దారి కిరుపక్క్ల కొండలు లేవు. యడారిమధ్యే భాట, అడివిలేదు. ధూమా అనేఊరు కసుబాస్థలము, బస్తీ అయినది. దుకాణం దారులు సక్తులయినా బస్తీస్థలమందు వాసముచేసేవారు గనుక బేఫరాచేత ముసాఫరుల నిమిత్తమై యెంతమాత్రమున్ను వసతి అయిన కొట్టాయిలు కట్టినవారు కారు. నేను వూరికి బయట డేరాలు వేసి దిగినాను. నాలుగు శిపాయిడేరాలు, ఒక కంబళిడేరా, ఒక యెంటి కంభం డేరా అంతు ఆరుడేరాలున్ను వేయడానికి 40 బోయీలున్ను, ముగ్గురు కళాసులున్ను వుండిన్ని దిగిన వెనక 1 ఘంటసేపు పడుచున్నది. ఈయూరిలో బియ్యము తప్ప సకలపదార్ధాలున్ను దొరికినవి. యీదేశాస్థులకు పిండిజరూరే గాని బియ్యము నిమిత్తము సిద్ధముగా ఉంచడము లేదని చెప్పినారు. బహు ప్రయత్నముమీద నాపరిజనుల కందరికిన్ని చాలేటందుకు ఎక్కువగానే శ్రీరామ కటాక్షముఛేత బియ్యము