పుట:Kasiyatracharitr020670mbp.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

చాలు నని అవరారా లెత్తినాదు కాడని తోచుచున్నది. అందువల్ల అతనికి అవతారాలు, తత్సంబంధము లయిన నామాలున్ను లేవు. లీలా విశేషలు చేత కలిగిన నామాలు మాత్రము అనేకములుగా అతనికి కలిగి యున్నవి. రక్షించ వలసినపని సాత్విక మూర్తి యయిన శ్రీమన్నారాయణమూర్తికి నియత మయియున్నవి గనుకనున్ను అందులో దుష్టులకు శిష్టులను హించ పెట్టడము ఇష్టముగా నుంచున్నది గనుకనున్ను విష్ణువు మాత్రము అనేకవతారాలు లోకశిక్షార్ధమయి యెత్తి, సాధువులను రక్షించి తదపేక్షయా దుష్టులను పరిష్కార ముగా నిరూపింపుచు యధోచితముగా శిక్షించి శిక్షానంతరము మళ్ళీ రక్షింపుచు వచ్చినాడు గనుక అతనికి అనేకావరాతాలెత్తవలసి వచ్చినది. ప్రతియవతారానికిన్ని ఒక నామము గలిగిన దని నాకు తోచుచున్నది. రజోగుణముచేత సృష్టించడానికి నియమింపబడిన బ్రంహ్మకున్ను సాంబమూర్తి వలెనే అవతారాలు అగత్యము లేనందున ప్రపంచములో ఒక యవతారము నయినా వహించ లేదు. సాంబమూర్తి సంహార నిమిత్తమయి లేక పోయినది. తద్ద్వారా అతనికి నామాంతరముకూడా లేకపోయినదనిన్ని తోచుచున్నది. ఈరీతిగానే పరబ్రంహ్మ యీ బ్రంహ్మాండములో కొంత ప్రదేశమందు క్రీస్తు యెడల ప్రతిఫలించి ఆభాతి పాత్రద్వారా యెక్కువయి ఆ దేశస్థులకు అతను శిక్షకు డయినాడు. ఆ ప్రకారమే మహమ్మదు వగయిరాలు ఆయా దేశాలకు పూజ్యులయి యీశ్వరసమము లయినారు. మనము రామకృష్ణాద్యవరారాలను లోకశిక్షకములుగా భావించి ఆ నామోచ్చారణ చేసి ఆరాధించినట్టు ఇతరదేశస్థులు అక్కడ అవతరించిన వారిని ఆరాధింపుచున్నారు. ఏ పేదుతో ఏ మూర్తినిగాని, ఏవస్తువునుగాని యేరీతిగా ఆరాధించినా ప్రతిగృహీత అంతర్యామి యొక్కడే గనుక ఏమిన్ని బాధకము లేదు. ఈయుక్తిచేతనే "గురుబ్రంహ్మ గురువిష్ణు" అనే ప్రశస్త వాచకాలు ఏ ప్రకృతి పట్టితే ఆ ప్రకృతే ఆ ప్రకృతే సమస్త