పుట:Kasiyatracharitr020670mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వొరగానున్ను తోటలు యిండ్లున్ను కట్టుకున్నారు. యీ ప్రాంతములలో జాజిపూలున్ను మొల్లపూలున్ను దొరుకునుగాని, మల్లెపూలు లేవు. శ్రీరంగ కస్తూరి పట్టెలు చెన్నపట్టణము వదలిన వెనక కండ్లచూడవలసినది లేదు. నాగపూవు రాజ్యము మొదలుగా యీనపుడకలు దొరకవు. ఈతాకులతో శృంగారకట్టలు కట్టుకొని పనులు గడుపుతారు. విస్తరాకులు జొన్నచొప్పతోను, వెదురు దబ్బలతోనున్ను కుట్టుకోవలసినది. సన్నిగల్లు గుండు కడప వదిలిన వెనక లోకులు వాడడము లేదు. నూరవలసిన పదార్ధాలంతా రోటిలోవేసి తొక్కవలసినది. నిండా మన దేశస్థులకు సన్నిగల్లు కావలసిన ప్రయత్నము చేస్తే కలవంగుండు సంపాదించి అందు గుండా పని గడుపు కొనవలసినది. కామిటి అనే కంటోనుమెంటు దండువుండే ప్రదేశములలో నున్ను పార్శివారు ఇంగిలీషు షాపులుకూడ వుంచి యున్నారు. ఊరున్ను, బజారు వీధులతో బస్తిగా కనుపడుచునున్నా హయిదరాబాదులో యింగిలీషుదండువుండే బస్తీకళలో శతాంశలలో నొక యంశయైనా లేకుండా వున్నది. అది యెందుచేతనంటే 'స్వయం రాజా స్వయంమంత్రి 'అనే న్యాయ ప్రకారముగా రాజ్యానికిన్ని దండుకున్ను యింగిలీషు వారే యిదివరకు ఖామందు లయి యుండినందున వీరి ప్రాపును అనుసరించి వీరి దండులో లోకులు చేరవలసిన అగత్యము యిదివరకు లేకుండా వుండిపోయినది. అంతేకాకుండా యీసరికి హయిదరాబాదు ప్రభువు 'లేస్తే కొరగాని చేను తోలే మంచమీది మొండివానివలె 'గౌరవములను కాపాడుకొనుచు వచ్చుచున్నాడు గనుకనున్నునాగపూరు వారు స్నానము చేసి చలి భయమును పోగొట్టుకున్నారు గనుకనున్నుయింగిలీషువారి దాపున్ను, చెల్వమున్ను హయిదరాబాదు వారి దేశములో వెశేషముగా నున్నది.

ఇంతే కాకుండా ప్రపంచంలో ఒక మంచితో కూడా, ఒక చెడు కలిసి యుంటేనే సౌఖ్యహేతువుగా తొచుచున్నది. నాగపూరు రెసైడెంటు అయిన *[1] మేస్తర్ గ్రీన్ దొరగారితో ప్రపంచ సంబంధము లయున కొన్ని మాటలు మాట్లాడుచు నుండగా ప్రపంచమే పుణ్య పావ

  1. *Mr.Groeme.